ఆంధ్రప్రదేశ్ పౌరులకు శుభవార్త ! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పేద విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థలలో చదువుకునేందుకు గాను అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం G.O విడుదల చేసింది.
స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ , సమగ్ర శిక్ష నుండి ఆంధ్రప్రదేశ్ రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ రూల్స్ – 2010 ద్వారా 25 శాతం సీట్లు కేటాయించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ G.O కి సంబంధించి ఎవరు అర్హులు , ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి & అవసరమగు ధ్రువపత్రాలు వంటి అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🏹 ఏపీ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥ప్రైవేట్ పాఠశాలలలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్ల కేటాయింపు :
2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ మేనేజ్మెంట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ నందు 1 వ తరగతి అడ్మిషన్ల ద్వారా పేద, బలహీన వర్గాలకు అవకాశం కల్పిస్తూ RTE యాక్ట్ 2009 ద్వారా ఈ G.O విడుదల చేశారు.
🔥అవసరగు అర్హతలు : కొన్ని ఎంపిక కాబడిన వర్గాలకు మాత్రమే ఈ సీట్ల కేటాయింపు వుంటుంది. మొత్తం 25 శాతానికి గాను అందులో
అనాథలు, HIV బాధితులు, దివ్యాంగులు వారికి = 5 శాతం.
ఎస్సీ లకు = 10 శాతం
ఎస్టీ లకు = 4 శాతం
బీసీ, మైనారిటీ, ఓసీ వారికి = 6 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
🔥 వయస్సు నిర్ధారణ :
ఐబీ , CBSE, ICSE సిలబస్ గల పాఠశాల నందు అడ్మిషన్ కొరకు 31/03/2025 నాటికి ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి.
స్టేట్ సిలబస్ గల పాఠశాల నందు అడ్మిషన్ కొరకు 01/06/ 2025 నాటికి ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి.
🏹 ఏపీలో 2260 పోస్టులకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ – Click here
🔥 దరఖాస్తు చేయు విధానం :
ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత గల పిల్లల తల్లిదండ్రులు / సంరక్షకులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.సందేహాలు ఉన్న వారు స్థానిక హెడ్మాస్టర్/ మండల విద్యా అధికారి/గ్రామ వార్డు సచివాలయం ల సహాయం తీసుకోవాలి.
తేది 28/04/2025 నుండి 19/05/2025 లోగా ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
🔥 అవసరమగు సర్టిఫికెట్స్ :
నివాస ధ్రువీకరణ కొరకు తల్లిదండ్రుల ఆధార్ కార్డు / ఓటర్ కార్డ్ / రైస్ కార్డు / కరెంట్ బిల్లు మొదలగునవి.
పిల్లలు దివ్యాంగులు అయితే సంబంధిత ధ్రువపత్రం
HIV బాధితులు అయితే సంబంధిత ధ్రువపత్రం
ట్రాన్స్ జెండర్ పిల్లలకు సంబంధిత మెడికల్ ధ్రువపత్రం
EWS పిల్లలకు ఆదాయ ధ్రువీకరణ కొరకు రైస్ కార్డు / AAY కార్డు
బర్త్ సర్టిఫికెట్ వంటివి కలిగి వుండాలి.
🔥 ఎంపికా విధానం :
దరఖాస్తు చేసుకున్న వారిని లాటరీ విధానం ద్వారా ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన తేదీలు :
నోటిఫికేషన్ విడుదల తేది : 17/04/2025
విద్యా సంస్థల రిజిస్ట్రేషన్ : 19/04/2025 నుండి 26/04/2025
విద్యార్థి రిజిస్ట్రేషన్ : 28/04/2025 నుండి 19/05/2025 వరకు
GSWS డేటా ద్వారా విద్యార్థుల అర్హత నిర్ధారణ : 16/05/2025 నుండి 20/05/2025
మొదటి విడత లాటరీ ఫలితాల విడుదల : 21/05/2025 నుండి 24/05/2025 వరకు
స్కూల్స్ ద్వారా విద్యార్థి అడ్మిషన్ కన్ఫర్మేషన్ చేయుట : 02/06/2025
రెండవ విడత లాటరీ ఫలితాల విడుదల : 06/06/2025
స్కూల్స్ ద్వారా విద్యార్థి అడ్మిషన్ కన్ఫర్మేషన్ చేయుట : 12/06/2025.
మరింత సమాచారం కొరకు మరియు ఇతర విషయాలు కొరకు సందేహాలను నివృత్తి కొరకు సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారిని సంప్రదించవచ్చు లేదా టోల్ ఫ్రీ నెంబర్ 18004258599 ను సంప్రదించవచ్చు.
👉 Click here for official website