ప్రారంభం అయిన DSC పరీక్షలు – ఇక ప్రతి సంవత్సరం DSC | AP DSC Latest News Today

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మెగా DSC పరీక్షలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల జారీ చేసి 16,347 ఉద్యోగాల భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ గారు డీఎస్సీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియచేశారు.

అలానే విద్యా శాఖా మంత్రి గారు నిర్వహించిన సమీక్షలో ఇక నుండి ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు.

🔥ప్రశాంతంగా డిఎస్సీ పరీక్షలు :

  • రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. మొత్తం నెల రోజులు పాటు నిర్వహించనున్న ఈ పరీక్షలలో జూన్ 5న తొలి రోజు పరీక్షలు నిర్వహించారు.
  • రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు ఉదయం 91 పరీక్ష కేంద్రాలలో నిర్వహించిన ఈ పరిక్ష కు 14281 మంది అభ్యర్థులు హాజరు అయ్యారు. రెండో పూట 51 కేంద్రాలలో పరీక్ష నిర్వహించగా 7611 మంది అభ్యర్థులు పరిక్ష రాసారు.
  • జిల్లాల వారీగా హాజరు అయిన అభ్యర్థులను పరిశీలించగా ఉదయం కడప జిల్లా లో 91.1 శాతం మరియు మధ్యాహ్నం నెల్లూరు జిల్లాలో 92 శాతం మంది హాజరు అయ్యారు.

🔥ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం : నారా లోకేష్

  • రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు పాఠశాల , ఇంటర్మీడియట్ , ఉన్నత విద్య , సమగ్ర శిక్ష అభియాన్ ల పై సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా మంత్రి గారు మాట్లాడుతూ 16347 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసి , భర్తీ చేస్తున్నాం అని తెలిపారు.
  • DSC తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి అని ప్రకటించారు.
  • రాష్ట్రం లో ఉపాధ్యాయుల యొక్క బదిలీలు మరియు పదోన్నతులు కూడా సక్రమంగా నిర్వహిస్తామని తెలియచేశారు.
  • రాష్ట్రంలో. విద్యా ప్రమాణాలు పొంపొందేందుకు గాను వివిధ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి గారు తెలియచేసారు.
  • ఇక నుండి ప్రతి సంవత్సరం టీచర్ ఉద్యోగాల భర్తీ చేసేందుకు గాను DSC నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి గారు తెలియచేసారు.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *