పెరుగుతున్న కోవిడ్ కేసులు – ముఖ్యమైన సూచనలు చేసిన వైద్య ఆరోగ్యశాఖ | Covid-19 Important Instructions

Covid-19 Important Instructions for People
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మళ్ళీ ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా ఆసియా దేశాల్లో గల సింగపూర్, థాయిలాండ్, హాంకాంగ్ వంటి తదితర దేశాలలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 

ప్రస్తుతం కరోనా కేసుల పెరుగుదలలో ఒమిక్రాన్ ఉప వేరియంట్లు అయిన L.F 7, N.B 1.8, JN 1, వేరియంట్లు కీలకంగా ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో కూడా 57 కోవిడ్ యాక్టివ్ కేసులో ఉండడంతో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఆరోగ్య శాఖ ద్వారా ప్రజలకి పలు సూచనలు జారీ చేశారు.

🔥 కొవిడ్-19 వ్యాప్తి పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ :

  • కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశాఖ ద్వారా పలు సూచనలను ప్రజలకు జారీచేసింది. సూచనలను తప్పక పాటించాలి.
  1. ప్రార్థనా సమావేశాలు, సామాజిక సమావేశాలు, పార్టీ కార్యక్రమాలు మొదలగు సామూహిక సమావేశాలను ఆపివేయాలి.
  2. రైల్వే స్టేషన్లు, బస్ స్టాప్ లు, విమానాశ్రయాలు వంటివి కోవిడ్ – 19 ప్రవర్తనా నియమావళి తప్పనిసరిగా పాటించాలి.
  3. వృద్ధులు (60 సంవత్సరాలు దాటిన వారు) మరియు గర్భిణి స్త్రీలు తప్పనిసరిగా ఇంటి లోపలే ఉండవలెను.
  4. మంచి పరిశుభ్రత పాటించాలి : క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవాలి మరియు దగ్గు / తుమ్ములు వచ్చినప్పుడు ముఖాన్ని మూసుకోవాలి మరియు చేతితో ముఖాన్ని తాకకుండా వుండాలి.
  5. హై రిస్క్ ఏరియా లలో మాస్కులు ధరించండి : ఎవరైనా అధికంగా రద్దీగా ఉన్న ప్రదేశాలలో లేదా తక్కువగా గాలి వీస్తున్న ప్రదేశాలలో వున్నట్లు అయితే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.ఇలాంటి ప్రదేశాలలో మాస్క్ ధరించడం వైరస్ వ్యాప్తి తగ్గించడం లో సహాయకరంగా ఉంటుంది.
  6. కోవిడ్ – 19 లక్షణాలు ఉంటే పరీక్ష చేసుకోండి : కోవిడ్-19 కేసులను త్వరగా గుర్తించడం లో మరియు ఐసోలేషన్ చేయుటకు కోవిడ్-19 పరీక్ష ను ప్రధాన సాధనంగా చెప్పవచ్చు కాబట్టి ఎవరికైనా లక్షణాలు కలిగి ఉంటే వెంటనే కోవిడ్ పరీక్ష చేసుకోవాలి.
  7. ప్రస్తుతం కోవిడ్-19 ద్వారా ప్రభావితం అయిన దేశాలలో ఎవరైనా ప్రయాణించినట్లు అయిన వారు తప్పనిసరిగా కోవిడ -19 పరీక్ష ను చేసుకోవాలి.

🏹 ప్రజలందరికీ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ – Click here

కోవిడ్-19 సాధారణ లక్షణాలు : కోవిడ్ – 19 కి సంబంధించి లక్షణాలు వ్యక్తిని బట్టి మారుతూ వుంటాయి. జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతు నొప్పి, రుచి వాసన లేకపోవుట, తలనొప్పి, కండరాల లేదా శరీర నొప్పులు, జలుబు, ముక్కు దిబ్బడ, వికారం, వాంతులు, డయేరియా వంటివి కోవిడ్-19 లక్షణాలు గా ఉంటాయి.

  1. మీకు అనారోగ్యంగా ఉన్నట్లు అయితే తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం ద్వారా మరియు ఇతరులతో సంబంధాన్ని నివారించడం ద్వారా  ఇతరుల ప్రాణాలను రక్షించే వారు అవుతారు.
  • ముఖ్య గమనిక : ఆరోగ్యశాఖ వారు టెస్టింగ్ ఫెసిలిటీస్ తో పాటుగా మాస్క్, పిపిఈ కిట్, మూడు లేయర్ల మాస్క్ 24/7 అందుబాటులో ఉంచుకోవాలి.

కావున ప్రజలందరూ ఆరోగ్య శాఖ వారిచ్చిన పై సూచనలను తప్పక పాటించవలసిందిగా కోరుతున్నాము.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *