పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది.. తిరుమల తిరుపతి దేవస్థానముకు చెందిన శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల (Girls) మరియు మరియు శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల (Boys) లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
టిటిడి కళాశాలల్లో మొత్తం ఎన్ని సీట్లు (TTD College Total Seats)
మొత్తం 1760 సీట్లు ఉన్నాయి. ఇందులో శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలలో 968 సీట్లు , శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో 792 సీట్లు ఉన్నాయి.
గ్రూపులు వారిగా సీట్లు వివరాలు :
- గ్రూపులు వారిగా ఇంగ్లీష్ మీడియం సీట్లు ఇవే : MPC – 352, MEC – 176, CEC – 440, HEC – 264
- శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో తెలుగు మీడియంలో CEC గ్రూపులో 88 సీట్లు, HEC గ్రూపులో 88 సీట్లు ఉన్నాయి.
టీటీడీ కళాశాలల్లో వసతి కూడా ఉంది :
TTD కళాశాలల్లో చదువుకున్న వారికి హాస్టల్ వసతి కూడా ఉంటుంది. ఇందులో బాలికలకు 450 సీట్లు, బాలురకు 400 సీట్లు ఉన్నాయి..
టీటీడీ కళాశాలల ఫీజు వివరాలు :
- ఈ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు MPC / BIPC గ్రూపుల్లో ప్రవేశాలు పొందితే సంవత్సరానికి 5,350/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
- MEC / HEC / CEC గ్రూపుల్లో ప్రవేశాలు పొందితే సంవత్సరానికి 4,000/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
టిటిడి కళాశాలల్లో ప్రవేశాలకు ఉండాల్సిన అర్హత :
టీటీడీ కళాశాలల్లో ప్రవేశాలు పొందడానికి పదో తరగతి పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు.
🏹 ఇలాంటి విద్యా మరియు ఉద్యోగాలు సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ లో వాట్సాప్ కు రావాలి అంటే క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి మా వాట్సాప్ ఛానల్ లో వెంటనే జాయిన్ అవ్వండి..
విద్యార్థులను ఎంపిక చేసే విధానం :
పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీల వివరాలు :
అప్లికేషన్ చివరి తేదీ : 31-05-2025
మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 05-06-2025
అడ్మిషన్స్ తేదీ : 09-06-2025
🏹 Official Website – Click here