దీపం పథకం డబ్బులు క్రెడిట్ అవ్వలేదా ? ఆయితే ఈ విధంగా చేయండి | AP Government Deepam Scheme Status | AP Government Super Six Schemes

దీపం పథకం స్టేటస్ | Deepam Scheme Status
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గత దీపావళి నాడు దీపం 2.0 పథకాన్ని ప్రారంభించి అమలు చేస్తుంది. ఇందులో భాగంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేయడం జరుగుతుంది. అయితే దీపం పథకంలో ఇప్పటివరకు ఈ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి లబ్ధిదారులు సిలిండర్లను విడిపించుకున్న తర్వాత ఆ మొత్తాన్ని నగదు బదిలీ రూపంలో వారి అకౌంట్లకు ప్రభుత్వం జమ చేస్తుంది.

దీపం పథకం అమలులో సాంకేతిక సమస్యలు :

దీపం పథకం కి సంబంధించి నగదు బదిలీలో చాలావరకు సాంకేతిక సమస్యలు ఉండడంతో కొంతమంది లబ్ధిదారులకు లబ్ధి చేకోరలేదు అనే మాట వినిపిస్తోంది. దీనికి ముందుగా లబ్ధిదారులు క్రింద పేర్కొన్న విధంగా చెక్ చేసుకుని అమౌంట్ ను వారి ఖాతాల్లో జమ చేసుకునే అవకాశం ఉంటుంది.

దీపం పథకం అమలులో సాంకేతిక సమస్యలను వీలైనంత త్వరగా తీరుస్తామని , అర్హులందరికీ లబ్ధి చేకూరే విధంగా చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలియజేయడం జరిగింది.

అలానే ఈ పథకం అమలులో వివిధ మార్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయనుంది.

దీపం పథకం ద్వారా లబ్ది పొందడంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారందరూ ఈ క్రింది పేర్కొన్న అంశాలను ముందుగా సరిచూసుకోవాల్సి ఉంటుంది.

అలానే దీపం పథకం కి సంబంధించి స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి అనేది కూడా ఈ ఆర్టికల్ లో తెలియచేశాం.

🔥 దీపం పథకం కొరకు ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందా ? :

ప్రస్తుతం రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నగదు బదిలీ పథకాలు అన్ని కూడా Direct Benifit Transfer (DBT) ద్వారా లబ్ది చేకూర్చుతున్నాయి. ఇందులో భాగంగా ఆధార్ కి బ్యాంకు అకౌంట్ లింక్ కావడం మరియు NPCI లింక్ అయి , Active గా ఉండడం అన్నది తప్పనిసరి.

కావున లబ్ధిదారులు అందరూ తప్పనిసరిగా వారి యొక్క ఆధార్ కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యింది లేనిది మరియు NPCI Link అయ్యింది లేనిది తెలుసుకోవాలి. లింక్ కాకపోతే బ్యాంకు అకౌంట్ ఉన్న బ్రాంచ్ కి వెళ్లి లింక్ చేసుకోవాలి.

🔥 దీపం పథకం కొరకు EKYC తప్పనిసరి :

  • దీపం పథకం ద్వారా లబ్ది పొందేందుకు గాను EKYC తప్పనిసరి. EKYC పూర్తి కానిదే వారికి దీపం పథకం ద్వారా లబ్ది చేకూరదు. కావున గ్యాస్ కనెక్షన్ కలిగి వున్న వారు అందరూ EKYC చేసుకోవాలి. దీని కొరకు దీపం పథకం ద్వారా నగదు బదిలీ కాని వారు మీ యొక్క బ్యాంకు బ్రాంచ్ కి వెళ్లి బ్యాంకు సిబ్బంది సహకారం తో మీ అకౌంట్ కి ఆధార్ , NPCI లింక్ చేసుకోవాలి.
  • పై రెండు సక్రమంగా ఉంటే వారి అకౌంట్ లో కచ్చితంగా అమౌంట్ క్రెడిట్ అవుతుంది.

🔥దీపం పథకం స్టేటస్ ను ఈ విధంగా తెలుసుకోండి :

  • రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దీపం పథకం యొక్క స్టేటస్ ను లబ్ధిదారులు చాలా ఈజీ గా తెలుసుకోవచ్చు.
  • రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మనమిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా తెలుసుకొనేందుకు అవకాశం ఉంది.
  • ముందుగా మన మిత్ర వాట్సాప్ నెంబర్ అయిన 9552300009 ను సేవ్ చేసుకొని , Hai అని మెసేజ్ చేయాలి.
  • తర్వాత సిటిజన్ సర్వీసులు లో భాగంగా CIVIL SUPPLY SERVICES ను ఎంచుకోవాలి.
  • తర్వాత CIVIL SUPPLY SERVICES విభాగంలో deepam status ను ఎంచుకొని మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ లేదా LPG నెంబర్ ను ఎంటర్ చేసి , కన్ఫర్మ్ చేయాలి.
  • సరైన వివరాలు నమోదు చేస్తే మీ యొక్క దీపం పథకం స్టేటస్ ను తెలుసుకోవచ్చు.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!