తెలంగాణ ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్ల ఉద్యోగాలు | Telangana RTC Outsourcing Conductor Jobs recruitment 2025 | TGSRTC Outsourcing Conductor Jobs

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ విధానంలో కండక్టర్ల నియామకానికి రంగం సిద్ధమైంది.

ఈ పోస్టులను భర్తీ చేసేందుకు బస్సు భవన్ నుండి రీజనల్ మేనేజర్లకు ఉత్తర్వులు కూడా జారీ కావడం జరిగింది. ఈ ఉత్తర్వుల్లో కండక్టర్ల నియామకానికి విధివిధానాలు, జీతభత్యాలు వంటి వివరాలు వెల్లడించారు.. వీటికి సంబంధించిన వివరాలు క్రింద విధంగా ఉన్నాయి.

తెలంగాణ ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాలకు అర్హతలు :

  • తెలంగాణ ఆర్టీసీ లో ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసే కండక్టర్ ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయినవారు అర్హులు.

🏹 తెలంగాణ ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాలను భర్తీ చేసే సంస్థ :

  • తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఔట్సోర్సింగ్ విధానంలో కండక్టర్ ఉద్యోగాలను మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా భర్తీ చేసినందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాల జీతము వివరాలు :

  • తెలంగాణ ఆర్టీసీ లో ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసే కండక్టర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 17,969/- జీతం చెల్లిస్తారు. వీరు ఓవర్ టైం డ్యూటీలు చేసే సమయంలో గంటకు వంద రూపాయలు చొప్పున చెల్లిస్తారు. అంతకుమించి పనిచేస్తే గంటకు 200 రూపాయలు చొప్పున చెల్లిస్తారు.

🏹 పదో తరగతి అర్హతతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here

🏹 తెలంగాణ ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాలకు ఉండవలసిన వయస్సు :

  • తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలకు 21 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.

తెలంగాణ ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాలు ఇతర వివరాలు :

  • ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి టీజీఎస్ఆర్టిసి ట్రైనింగ్ కాలేజీలో వారం రోజులు పాటు శిక్షణ ఇస్తారు.
  • ఔట్సోర్సింగ్ కండక్టర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సుల్లో విధులు నిర్వహించే అవకాశం కల్పిస్తారు.
  • ఔట్సోర్సింగ్ కండక్టర్లకు ప్రమాద బీమా కాంట్రాక్టర్ చెల్లిస్తారు.
  • అభ్యర్థుల పదో తరగతి సర్టిఫికెట్లను కాంట్రాక్టర్ల ద్వారా ఆర్టీసీ తీసుకుంటుంది.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *