తెలంగాణ రాష్ట్రంలో గల ఉద్యోగార్ధులకు శుభవార్త ! ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ కి హాజరు అయి, అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాలు ను పొందేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ లోని 10 జిల్లాలో 20 ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాధిపతికన భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు ను ఈ ఆర్టికల్ లో తెలియ చేశాం. ఈ నోటిఫికేషన్ కి ఏ విధంగా దరఖాస్తులు చేసుకోవాలి ? అవసరమగు విద్యార్హతలు ఏమిటి ? ఎంపిక విధానం ఏమిటి ? ఇంటర్వ్యూ ఎక్కడ నిర్వహిస్తారు వంటి అన్ని అంశాల కొరకు ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
ప్రతి రోజూ ఇలాంటి ఉద్యోగాల సమాచారం మీ మొబైల్ కు రావాలి అంటే క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి..
🔥 అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాలుకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- తెలంగాణ రాష్ట్రం లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ , హైదరాబాద్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేయబోయే వార్డెన్ ఉద్యోగాలు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
- మొత్తం 20 ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా , ఇందులో పురుషులకు 10 మరియు మహిళలకు 10 కేటాయించారు.
🔥 వార్డెన్ ఉద్యోగాలు – అవసరమగు విద్యార్హతలు :
- సోషల్ వర్క్ లో మాస్టర్స్ లేదా M.A సోషియాలజీ పూర్తి చేసి ఉండాలి.
- హాస్పిటాలిటీ లో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ చేసి వుండాలి.
- హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ లో బ్యాచిలర్స్/ మాస్టర్స్ చేసి వుండాలి.
- కమ్యూనిటీ సైన్స్ / హోమ్ సైన్స్ లో B.Sc ఉత్తీర్ణత
🔥 వార్డెన్ ఉద్యోగాలు – పోస్టింగ్ ప్రదేశం :
- రాజేంద్ర నగర్ (రంగారెడ్డి )
- హైదరాబాద్
- అశ్వారావుపేట
- జగిత్యాల
- పాలెం ( నాగర్ కర్నూల్)
- వరంగల్
- రాజన్న సిరిసిల్ల
- కండి (సంగారెడ్డి)
- రుద్రుర్ ( నిజామాబాద్)
- ఆదిలాబాద్
🔥 వార్డెన్ ఉద్యోగాలు ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులను ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
- ఇంటర్వ్యూ ను 20/06/2025 న ఉదయం 10:00 గంటల నుండి నిర్వహిస్తారు.
✅ డిగ్రీ అర్హతతో 14,582 ఉద్యోగాలు – Click here
🔥 వార్డెన్ ఉద్యోగాలు ఇంటర్వ్యూ నిర్వహణ స్థలం :
- Knowledge management centre ,PJTAU campus , Rajendra Nagar , Hyderabad.
🔥 వార్డెన్ ఉద్యోగాలు ఇంటర్వ్యూ కి అవసరమగు ధ్రువపత్రాలు :
- విద్యార్హత సర్టిఫికెట్లు
- ఆధార్ కార్డ్
- బ్యాంకు పాస్ బుక్
- పాన్ కార్డ్
- ఇటీవల పాస్పోర్ట్ సైజ్ ఫోటో
- దరఖాస్తు ఫారం
- పైన పేర్కొన్న అన్ని సర్టిఫికెట్లు ఒరిజినల్ తో పాటుగా అటెస్టెడ్ కాపీలు తీసుకొని వెళ్ళాలి.
🔥 వార్డెన్ ఉద్యోగాలు కు జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకు 35,000/-రూపాయలు జీతం ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ గా లభిస్తుంది.
🔥ముఖ్యమైన తేదీలు :
- ఇంటర్వ్యూ నిర్వహణ తేది : 20/06/2025