ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహానాడు కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఇందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ అంశాల గురించి ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో భాగంగా వివిధ సంక్షేమ పథకాల యొక్క వివరాలు మరియు అమలు చేయి విధానం , తేదీలను కూడా ప్రకటించడం విశిష్టత సంతరించుకుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహానాడు కార్యక్రమంలో ప్రకటించిన వాటిలో తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ పథకాలు ప్రధానంగా ఉన్నాయి.
- ముఖ్యమంత్రి గారు ప్రస్తావించిన ఈ పథకాల వివరాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 మరికొద్ది రోజులలో రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా లబ్ధి :
- మహానాడు కార్యక్రమం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పథకం అమలు అంశం పై కీలక వాఖ్యలు చేశారు.
- అన్నదాత సుఖీభవ పథకాన్ని సంవత్సరానికి గాను మూడు విడతల్లో రైతులకు పెట్టుబడి సహాయంగా అందచేస్తాం అని తెలియచేసారు.
- అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పథకం అయిన పీఎం కిసాన్ యోజన పథకానికి అనుసంధానంగా కలిపి అమలు చేస్తామని, పీఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000/- రూపాయలు తో పాటు రాష్ట్ర ప్రభుత్వం 14,000/- రూపాయలు కలిపి మొత్తం 20,000/- రూపాయలు మూడు విడతల్లో అందచేయనున్నారు.
- కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తొలి విడత ను విడుదల చేసే రోజునే రాష్ట్ర ప్రభుత్వ వాటాను కూడా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు.
✅ ఏపీలో జూన్ 1 నుండి రేషన్ షాపు టైమింగ్స్ ఇవే – Click here
🔥 ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – ముఖ్యమంత్రి పునరుద్ఘాటన :
- ఇదే మహానాడు వేదికగా ముఖ్యమంత్రి వర్యులు సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన మరో పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా ప్రస్తావించారు.
- మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అని, ఇందులో భాగంగానే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించి ఆగస్టు 15 వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు.
- ఇప్పటికే ఈ పథకం అమలులో ఉన్న రాష్ట్రాలలో మంత్రుల బృందం పర్యటించడం , పథకం అమలు కొరకు నిర్దిష్ట ప్రణాళిక రూపొందించడం జరిగాయి.
🔥 స్కూల్ ప్రారంభానికి ముందే తల్లికి వందనం :
- గతంలో హామీ ఇచ్చిన విధంగానే ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి 15,000/- రూపాయల చొప్పున లబ్ది చేకూరేలా తల్లికి వందనం పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి గారు తెలియచేసారు.
- ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేశామని, తల్లికి వందనం పథకం కూడా వచ్చే నెల లోపుగా అమలు చేసి, అర్హులు అయిన తల్లులకు వారి అకౌంట్లలో డబ్బులు విడుదల చేస్తామని పేర్కొన్నారు.
- ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్ లో చదువుతున్న విద్యార్థులకు మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.