గ్రామ సచివాలయాల్లో 1896 పోస్టులు భర్తీకి నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ | AP Grama Sachivalayam 3rd Notification 2023 Update

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాలకు అనుబంధంగా ఉండే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1896 గ్రామ పశుసంవర్ధక సహాయకు ల(వీఏహెచ్ఎ) పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది.

ఈ పోస్టులు భర్తీకి నవంబర్ మొదటి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది.

ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు ఎప్పటికప్పుడు మన ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ లో తెలియజేస్తున్నాం.. 

కాబట్టి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు మీరు వీడియో రూపంలో కూడా కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 

🔥 INB jobs info YouTube Channel – Click here 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

📌 Download Our APP 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel

ఈ మేరకు భర్తీకి అనుమతినిస్తూ ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. 

గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన 3వ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగ అభ్యర్థులు ఎదురుచూస్తూ ఉన్నారు. 

గ్రామ , వార్డు సచివాలయాల్లో 19 రకాల  పోస్ట్లు ఉంటాయి.

గతంలో రెండు నోటిఫికేషన్స్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం , మూడవ నోటిఫికేషన్ ద్వారా  పోస్టులు భర్తీ చేయడానికి ఖాళీల వివరాలను సేకరించింది.

అయితే ప్రస్తుతం ప్రతి సంవత్సరం భర్తీ చేయడానికి అనుమతి ఇచ్చింది.

సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో 10,778 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలుత స్థానికంగా ఉండే పశు సంపద ఆధారంగా 9,844 వీఏహెచ్ఎలు అవసరమని గుర్తించి ఆ మేరకు నోటిఫికేషన్ ఇచ్చారు. రెండు విడతల్లో 4,643 ఆర్బీకేల్లో వీహెచ్ఎలను నియమించారు. 

కాగా, రేషనలైజేషన్ ద్వారా ఒకే గ్రామం లో 2, 3 ఆర్బీకేలున్న చోట గ్రామాన్ని యూనిట్ గా వీఏహెచ్ఎలను నియమించి, అదనంగా ఉన్న వీహెచ్ఏ లను వీహెచ్ఎలు లేని ఆర్బీకేలకు సర్దుబాటు చేసారు.

 వెటర్నరీ డిస్పెన్సరీలు, ఆస్పత్రులున్న గ్రామాల్లోని ఆర్బీకేల్లో వీఏహెచ్ఎను కూడా ఇతర ఆర్బీకేలకు సర్దుబాటు చేశారు. 

ఆ విధంగా 1,395 గ్రామాల్లో వెటర్నరీ డిస్పెన్సరీలు, 1,218 గ్రామాల్లో రూరల్ లైవ్ స్టాక్ యూనిట్స్ ఉండగా, ఆ మేరకు సిబ్బందిని సర్దుబాటు చేశారు. తద్వారా 6,539 ఆర్బీకేల పరిధిలో వీఏహెచ్ఎలు అవసరమవుతారని గుర్తించారు. వాటిలో ఇప్పటికే 4,643 ఆర్బీకేల్లో వీఏహెచ్ఎలు పనిచేస్తున్నందున . మిగిలిన 1896 ఆర్బీకేల పరిధిలో ఖాళీగా ఉన్న వీఏహెచ్ఎలను నియమించాలని గుర్తించారు. ఈ పోస్టుల భర్తీకి అనుమతి కోరుతూ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణను లేఖ రాశారు. ఈ మేరకు అనుమతినిస్తూ 1896 పోస్టుల భర్తీ ద్వారా 2030 ఆర్బీకేల్లో పశు వైద్య సేవలు అందు బాటులోకి రానున్నాయి. 

కాగా పశుసంవర్ధక శాఖ ద్వారా ఈ పోస్టుల భర్తీ కోసం నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్ సాక్షికి తెలిపారు.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *