ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతితో ఆశా కార్యకర్తల ఉద్యోగాలను భర్తీ చేసినందుకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన కమిషనర్ కార్యాలయం నుండి తాజాగా విడుదలైన ఉత్తర్వులు ప్రకారం రాష్ట్రంలో 26 జిల్లాల్లో 1294 ఆశా కార్యకర్తల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు.
తాజాగా తెలిపిన ఈ ఉత్తర్వులు ప్రకారం ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ జూన్ 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ నుండి విడుదలైన ఈ ఉత్తర్వులు ద్వారా గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది జనాభాకు ఒక ఆశా కార్యకర్తను నియమించాలని తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లో ప్రతి 2,500 మంది జనాభా కు ఒక ఆశా కార్యకర్తను నియమించాలని తెలిపారు.
✅ పదో తరగతి ఆర్టీసీలో 800 కండక్టర్ ఉద్యోగాలు – Click here
ఆశా కార్యకర్త ఉద్యోగాలకు ఉండవలసిన విద్యార్హతలు :
- ఆశా కార్యకర్త ఉద్యోగాలకు కనీసం పదో తరగతి విద్యార్హత ఉన్నవారు అర్హులు.
- పోస్ట్లు ఖాళీగా ఉన్న ప్రదేశం లో నివసిస్తున్న మహిళలు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.
- వివాహిత / వితంతువు / వేరుగా ఉంటున్న మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు.
- పోస్టులు ఖాళీగా ఉన్న ప్రదేశంలో అర్హత ఉన్న మహిళలు లేకపోతే విద్యార్హతల్లో సడలింపు ఉంటుంది.
ఆశా కార్యకర్త ఉద్యోగాలకు ఉండవలసిన వయస్సు :
ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీసం 25 సంవత్సరాల నుండి గరిష్టంగా 45 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు ఆశా కార్యకర్తల ఉద్యోగాలకు అర్హులు.
ఆశా కార్యకర్త ఉద్యోగాల ఎంపిక విధానం :
- గ్రామాల్లో అయితే విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ అప్లై చేసుకున్న వారిలో అర్హులైన వారిని ఒక్కో పోస్టుకు ముగ్గురిని చొప్పున ఎంపిక చేసి స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ కు లిస్టు పంపించాలి. మెడికల్ ఆఫీసర్ ఈ లిస్టును డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీకు పంపిస్తారు.
- పట్టణాల్లో అయితే అర్బన్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ అప్లై చేసుకున్న వారిలో అర్హులైన వారిని ఒక్కో పోస్టుకు ముగ్గురిని చొప్పున ఎంపిక చేసి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఉన్న మెడికల్ ఆఫీసర్ కు లిస్టు పంపించాలి. మెడికల్ ఆఫీసర్ ఈ లిస్టును డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీకి పంపిస్తారు.
- జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ చైర్మన్ గా ఉన్న డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో తుది ఎంపిక జరుగుతుంది.