ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది.
సచివాలయ ఉద్యోగులను ఎవరిని కూడా తొలగించబోమని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయాలు మరియు వాలంటీర్ల శాఖా మంత్రివర్యులు శ్రీ డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు మీడియా సమావేశంలో అధికారికంగా తెలియజేశారు.
అలానే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రమోషన్ చాలా నిమిత్తం, మహిళా పోలీసులకు సంబంధించి డిపార్ట్మెంట్ ఎంచుకునే అంశంపై, క్యాటగిరి ఏ సచివాలయంలో సిబ్బంది అంశంపై వివరణ ఇచ్చారు.
ఈ అంశాలకు సంబంధించి మరిన్ని వివరాలు కొరకు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకోగలరు.
🔥 సచివాలయం ఉద్యోగులకు ప్రస్తుతం బదిలీలు లేవు :
- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్న విధంగా ప్రస్తుతం సచివాలయ శాఖలో ఎటువంటి బదిలీలు నిర్వహించబడడం లేదని మంత్రివర్యులు తెలియజేశారు.
- రేషనలైజేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత శాస్త్రీయ పద్ధతిలో పని విభజన చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని, రేషనల్లైజేషన్ పై ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
🔥 వీరికి డిపార్ట్మెంట్ ఎంపిక చేసుకునే అవకాశం :
- ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయంలో పనిచేస్తున్న మహిళా పోలీసులను జనరల్ పర్పస్ కేటగిరీగా గుర్తించినప్పటికీ, వీరిని మరొక కేటగిరి లో చేర్చాలని నిర్ణయించడం జరిగింది.
- గ్రామ, వార్డు సచివాలయాల్లో గల మహిళా పోలీసులకు డిపార్ట్మెంట్ను ఎంపిక చేసుకుని అవకాశం కల్పించారు.
- ఇందులో భాగంగా వారు హోమ్ డిపార్ట్మెంట్ను లేదా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ను ఎందుకు చేసుకోవచ్చు.
- మహిళా పోలీసులు యొక్క హెచ్ఆర్ఎంఎస్ లాగిన్ లో “ mahila police calling form” అనే ఆప్షన్ ను ప్రొవైడ్ చేయడం జరిగింది.
🔥 ప్రత్యేక విధానం ద్వారా ప్రమోషన్ కల్పన :
- ప్రస్తుతం ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు వారి యొక్క సీనియారిటీ లిస్ట్ ఆధారంగా ప్రమోషన్ కల్పించేందుకుగాను ప్రత్యేక ఛానల్ క్రియేట్ చేయడం జరుగుతుందని మంత్రివర్యులు తెలియజేశారు.
- సీనియారిటీ ఆధారంగానే ఉద్యోగులకు ప్రమోషన్ కల్పన జరుగుతుందని నిర్ధారించారు.
🔥 శాస్త్రీయంగా రేషనలైజేషన్ :
- ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు పని భారం తగ్గే విధంగానే రేషనలైజేషన్ చేసిన ప్రక్రియను చేస్తామని, క్యాటగిరి ఏ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి మరియు డిజిటల్ అసిస్టెంట్ పోస్టులను తప్పనిసరి చేస్తామని తెలియజేశారు.
- గ్రామ, వార్డు సచివాలయలను పర్యవేక్షణ నిమిత్తం ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేస్తామని ,ప్రతి జిల్లాలో సచివాలయాల కొరకు మూడంచల విధానాన్ని రూపొందిస్తామని తెలియజేశారు.