కొత్త రేషన్ కార్డులుకు భారీగా దరఖాస్తులు – ఎప్పుడైనా రేషన్ కార్డు సర్వీసులు పొందవచ్చు | AP New Ration Cards Apply Process

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం వివిధ అంశాలను తెలియచేసింది.

రేషన్ కార్డ్ సర్వీసులు నిరంతర ప్రక్రియ గా సచివాలయంలో అందుబాటు లో ఉంటాయి అని పౌర సరఫరాల శాఖా మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలియచేసారు.

దీనితో పాటుగా EKYC, రైస్ కార్డ్ లో సభ్యులను చేర్చుటకు గల ప్రస్తుత విధానం, కార్డ్ లో సభ్యుని తొలగించుట లో ఉన్న అవాంతరాలు విషయాలు గూర్చి మంత్రిగారు  తెలియజేశారు.

రైస్  కార్డుకి సంబంధించి మంత్రిగారు తెలియజేసిన వివిధ అప్డేట్లు కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.

AP లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here

🔥 రేషన్ కార్డు దరఖాస్తు ఇక నిరంతర ప్రక్రియ :

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డ్ సర్వీసులకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు గాను మే 7వ తేదీ నుంచి అవకాశం కల్పించామని, గత రెండు సంవత్సరాల నుండి రేషన్ కార్డ్ సర్వీసులు కల్పించేందుకుగాను అవకాశం లేకపోయినందున ప్రజలు రేషన్ కార్డ్ సర్వీస్ మరికొద్ది రోజుల్లో ఆపేస్తారేమో అని ఆందోళనలో ఉండాల్సిన అవసరం లేదని, రేషన్ కార్డ్ సర్వీసులను నిరంతర ప్రక్రియగా గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతామని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలియజేయడం జరిగింది.
  • రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకొనేందుకు గాను ఎటువంటి గడువు విధించలేదని, రేషన్ కార్డ్ కి అర్హత ఉన్న వారు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అని, ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తామని తెలియచేసారు.
  • అలానే రేషన్ కార్డ్ సర్వీసులకు సంబంధించి మొత్తం ఐదు లక్షల దరఖాస్తులు రాగా అందులో కొత్త రేషన్ కార్డులు కావాలని 60,000 మంది, రేషన్ కార్డు విభజన కొరకు 44 వేల మంది, రేషన్ కార్డులో చిరునామా మార్పు కొరకు 12,500 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలియజేశారు.

🔥 ప్రజలకు మంత్రి క్షమాపణ:

  • ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డ్ డేటాను గ్రామ, వార్డు సచివాలయ డేటాతో అనుసంధానం చేయడం జరిగింది.
  • మే 07 వ తేదీ నుంచి రేషన్ కార్డు సర్వీసులు గాను దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించగా సర్వర్ సమస్యలు రావడం, గ్రామ, వార్డు సచివాలయాలలో దరఖాస్తులు స్వీకరణ చేయకపోవడం , టెక్నికల్ సమస్యలు ఉండడం , EKYC యాప్ లో సమస్యలు ఉండడం తో ప్రజలకు ఇబ్బంది కలిగి నందుకు మంత్రి గారు ప్రజలకు క్షమాపణలు తెలిపారు.
  • ప్రస్తుతం ప్రజలకు వెసులుబాటు జరిగిలా వివిధ చర్యలు తీసుకున్నట్లు తెలియచేసారు.

🔥 మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదు : మంత్రి నాదెండ్ల మనోహర్ పునరుద్ఘాటన.

  • రేషన్ కార్డులో సభ్యులను జోడించుట కొరకు మరియు రేషన్ కార్డు నుండి కుటుంబాల్ని విడదీయుట కొరకు గతంలో ఉన్న విధంగా మ్యారేజ్ సర్టిఫికెట్ ను తప్పనిసరి కాదని మంత్రిగారు పునరుద్ఘాటించారు. 
  • ఇప్పటికే మ్యారేజ్ సర్టిఫికెట్ లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ విధానం ద్వారా అందరికీ ఆదేశాలు కూడా జారీ చేశామని మంత్రిగారు స్పష్టం చేశారు.
  • మ్యారేజ్ సర్టిఫికేట్ మాత్రమే కాకుండా పెళ్లి ఫోటో గాని పెళ్లి కార్డు గాని లేకుండానే దరఖాస్తు స్వీకరించాలని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి తెలియచేశారు. కొన్ని సచివాలయాలలో ఈ కారణం చేత దరఖాస్తు తిరస్కరిస్తున్నారని ఇకనుండి తిరస్కరించే అవకాశం లేదని తెలియజేశారు.

🔥 21 రోజులలోనే కొత్త రేషన్ కార్డు మంజూరు:

  • రేషన్ కార్డుకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు 21 రోజుల్లోనే రేషన్ కార్డు మంజూరు చేసే విధంగా ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రిగారు తెలియజేశారు. 
  • ఇప్పటికీ వాట్సాప్ ద్వారా వివిధ సర్వీసులు అందించామని ఇందులో భాగంగా రేషన్ కార్డు కి సంబంధించి ఈ కేవైసీ,  ఆధార్ సీడింగ్ లో మార్పులు, రేషన్ కార్డ్ సరెండర్ సర్వీసులు కూడా అందుబాటులో ఉండేలా చేస్తామని మంత్రిగారు ప్రస్తావించారు.

🔥 డిలేషన్ కొరకు ప్రూఫ్ తప్పనిసరి:

  • రేషన్ కార్డులో ఒక్కరినీ లేదా కొంతమంది వ్యక్తులని తొలగించే ఆప్షన్ ప్రస్తుతం అందుబాటులో లేదని, కేవలం చనిపోయిన వ్యక్తులను మాత్రమే తొలగించే అవకాశం కల్పించమని తెలియజేశారు.
  • ఒక వారం రోజుల్లో వ్యక్తులను డిలీట్ చేసే అంశంపై నిర్ణయం తీసుకొని తెలియజేస్తామని, అయితే వ్యక్తులను డిలీట్ చేసేందుకు గాను ఖచ్చితమైన ప్రూఫ్ ఉండాల్సి ఉంటుందని తెలియజేశారు. 
  • కార్డులో ఉన్న కుటుంబ సభ్యులలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని మార్చుకునే అవకాశాన్ని కల్పించి ఉన్నామని తెలియజేశారు.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *