ఏపీ నిరుద్యోగులకు ఐదు లక్షల ఉద్యోగాలు | AP Government New Schemes | AP Work from home jobs

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియచేసింది. దేశంలోని ఏ రాష్ట్రంలోను లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో సంవత్సర కాలంలోనే 5 లక్షల ఉద్యోగాలను సృష్టించేలా ప్రభుత్వం ఒక గొప్ప కార్యాచరణ ను రూపొందిస్తుంది.

ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు ఒక ప్రకటన లో తెలియచేసారు.

మంత్రి గారు తెలియచేసిన సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥 5 లక్షల ఉద్యోగాల కల్పన కు కార్యాచరణ ; 

  • ప్రభుత్వం గతంలో ప్రకటించిన 5 లక్షల ఉద్యోగాల కల్పన అన్న అంశంపై ముందుకు వెళ్తుంది.
  • ఇందులో భాగంగా ఒక వినూత్న కార్యాచరణ ద్వారా ఉద్యోగాల కల్పన మరియు నైపుణ్య శిక్షణ కల్పించనున్నారు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది మరియు ఏం చేయనుంది ? :

  • రాష్ట్ర సమాచార , పౌర సంబంధాల శాఖా మాత్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు సోమవారం నిర్వహించిన సమీక్ష వివరాలను మీడియా కు తెలియచేస్తూ 5 లక్షల ఉద్యోగాల కల్పనకు తమ ప్రభుత్వం వినూత్న కార్యాచరణ రూపొందిస్తుంది అని తెలియచేసారు.
  • అలానే ఇప్పటికే 1000 మంది విద్యార్థులను ఎంపిక చేసి, వారికి నైపుణ్య పరీక్ష నిర్వహించారు.
  • నైపుణ్య పరీక్ష నిర్వహించిన వారిలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎటువంటి శిక్షణ లేకుండా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అని తెలియచేసారు.
  • మిగతా పట్టభద్రులకు కొంత మేరకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాలను అందచేసేందుకు కృషి చేస్తుంది.
  • ఈ అంశానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశం పై ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.
  • పెద్ద మొత్తంలో విద్యార్థులకు & నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవసరం అయితే ఒక వ్యవస్థ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గారు తెలియచేసారు.
  • విశ్వ విద్యాలయాలు మరియు మంచి పేరున్న కళాశాలల సహకారం తో ఇవన్నీ చేయనున్నట్లు తెలిపారు. 

🔥 గమనించవలసిన అంశాలు :

  • రాష్ట్ర ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే నిర్వహించి, వివిధ అంశాలను సేకరించింది. దీనిపై తదుపరి కార్యాచరణ చేసేందుకు సిద్దంగా ఉంది.
  • గ్రూప్ – 2 పరీక్ష నిర్వహణ & DSC నోటిఫికేషన్ విడుదల వంటి అంశాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తుంది.
  • అలానే ప్రతి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ద్వారా ప్రముఖ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలకు జాబ్ మేళా & మెగా జాబ్ మేళాలు నిర్వహించి వేల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
  • అలానే వివిధ కార్పొరేషన్ ల ద్వారా సబ్సిడీ ద్వారా లోన్స్ మంజూరు చేయించి  స్వయం ఉపాధి కల్పిస్తుంది.

సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *