ఏపీ టెట్ / డీఎస్సీ అప్డేట్స్ | వారికి గుడ్ న్యూస్ | AP TET Latest News today | AP DSC Latest News today | AP TET Results 2024 | AP TET Fee Refund Status 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ మరియు డీఎస్సీ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్. నోటిఫికేషన్ సమయంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారు అర్హులని పేర్కొనడంతో చాలామంది B.Ed అభ్యర్థులు ఫీజు చెల్లించి ఈ పోస్టులకు అప్లై చేసుకున్నారు. తర్వాత హైకోర్టు బిఈడి వారు ఎస్జిటి పోస్టులకు అనర్హులను తీర్పు ఇవ్వడంతో బీఈడీ అభ్యర్థులు టెట్ పేపర్ -1 పరీక్ష రాయలేకపోయారు. కాబట్టి ఫీజు చెల్లించిన అభ్యర్థులకు శుభవార్త చెప్తూ ఫీజును రిఫండ్ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరిలో నిర్వహించిన టెట్-2024, డీఎస్సీ కోసం ఫీజు చెల్లించి అనర్హులైన అభ్యర్థులకు వారి ఫీజును తిరిగి ఇస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. 

గతంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 30 మధ్య డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని షెడ్యూల్ విడుదల చేశారు. అయితే ఈలోపు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో టెట్ ఫలితాలు మరియు డీఎస్సీ పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

✅ APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-

✅ APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/- 

నోటిఫికేషన్ లో B.Ed అభ్యర్థులు కు టెట్ Paper-1 కు మరియు SGT పోస్టులకు అర్హులు గా పేర్కొన్నారు . కొంత మంది SGT అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో SGT పోస్టులకు B.Ed వారు అనర్హులు అని తీర్పు ఇచ్చింది.

హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడీ చేసిన అభ్యర్థులు టెట్ పేపర్-1కు, డీఎస్సీలో ఎస్టీలకు అనర్హులు అవడంతో బీఈడీ అభ్యర్థులు ఈ పరీక్షలకు చెల్లించిన ఫీజును వారి ఆధార్ నంబర్ లింక్ అయ్యి ఉన్న బ్యాంక్ ఖాతాల్లో వేస్తున్నట్లు చెప్పారు. 

ఈ విభాగంలో టెట్, డీఎస్సీకి 50,206 మందికి ఫీజు మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు 44,690 మందికి DBT  విధానంలో జమ చేశామన్నారు. కొంతమంది అభ్యర్థుల ఆధార్ నంబర్ వారి బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకోకపోవడంతో వారికి ఫీజు జమ కావడం లేదని తెలిపారు. ఇలాంటి వారు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి వారి ఆధార్ కార్డ్ కు లింక్ చేసిన బ్యాంక్ ఖాతా వివరాలను ఇవ్వాలని సూచించారు.

 కొంతమంది అభ్యర్థులు ఫీజు చెల్లించినా వారికి ఐడీ జనరేట్ కాలేదని, వీరికి కూడా ఫీజును తిరిగి ఇచ్చేందుకు అభ్యర్థి ఖాతాకు సరిగా జమ అవుతున్నాయో లేదో పరిశీలించేందుకు గాను అభ్యర్థులకు ఫీజులో ఒక్క శాతం అనగా రూ.7.50 చెల్లించామని, అన్నీ సక్రమంగా ఉన్నవారి అకౌంటు మిగిలిన ఫీజు మొత్తాన్ని వారి ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు. ఫీజును ఇంటర్నెట్ సెంటర్ల వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని కూడా కోరారు. 

అభ్యర్థి వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న బ్యాంక్ ఖాతా నంబర్ ఆధారంగానే ఫీజును తిరిగి జమ చేస్తున్నామని స్పష్టం చేయడం జరిగింది.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *