Andhra Pradesh Government Schemes Calendar 2025 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు కొరకు ఒక మంచి నిర్ణయాన్ని ప్రకటించింది. సంక్షేమ పథకాల అమలు కొరకు ఏ పథకాన్ని ఎప్పుడు అమలు చేయబోతున్నారు అనే అంశాలు పేర్కొంటూ సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయనున్నారు.
అలానే ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి కావడం తో ప్రజలపై వరాల జల్లు ప్రకటించింది.
ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు అయిన తేదీ జూన్ 12న వివిధ పథకాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. దీని ద్వారా ప్రజలకు లబ్ది చేకూర్చనుంది.
తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో వివిధ పథకాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు.
పైన పేర్కొన్న అన్ని అంశాల పై సమగ్ర సమాచారం కొరకు ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ ఏపీలో కొత్త రేషన్ కార్డులుకు whatsapp లో దరఖాస్తులు ఆహ్వానం – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 జూన్ 12న వీరి అకౌంట్లలో డబ్బులు జమ :
నూతన ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైన అన్నదాత సుఖీభవ మరియు తల్లికి వందనం పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది.
రైతులకు మరియు తల్లులకు ఈ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుంది.
🔥 సంక్షేమ క్యాలెండర్ విడుదల :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు నిమిత్తం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ పథకాలు & ఎన్నికల లో ఇచ్చిన హామీల అమలు కొరకు ప్రభుత్వం, వివిధ సంక్షేమ పథకాల అమలు కొరకు క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ సంక్షేమ క్యాలెండర్ లో భాగంగా ఏ పథకాన్ని ఏ నెలలో ఏ తేదీన లాంచ్ చేస్తారు అనే అంశాలను ప్రస్తావించునున్నారు.
ప్రతినెల ఒక సంక్షేమ పథకం ఉండే విధంగా 12 నెలల సంక్షేమ క్యాలెండర్ను విడుదల చేస్తారు.
🔥 పాఠశాలల ప్రారంభానికి ముందే తల్లికి వందనం పథకం అమలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రకటించిన ప్రాధాన్యత గల తల్లికి వందనం పథకాన్ని వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు ఓపెన్ అయ్యే నాటికే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తల్లికి వందనం పథకం ద్వారా ఇంటర్మీడియట్ లోపు చదువుతున్న పిల్లలు గల తల్లులకు ఒక్కొక్క విద్యార్థికి 15 వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం కల్పిస్తారు.
ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా, జూన్ 12వ తేదీన పాఠశాలలు తెరిచే లోపుగా ఈ పథకాన్ని అమలు చేస్తారు.
🏹 ఇలాంటి పథకాల సమాచారం మీ మొబైల్ కు రావాలి అంటే మా what’s app ఛానల్ లో జాయిన్ అవ్వండి – Click here
🔥 రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా పెట్టుబడి సహాయం :
ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది.
పెట్టుబడి సాయం నిమిత్తం ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా పీఎం కిసాన్ పథకంతో మిళితమై రైతులకు 20 వేల రూపాయలు లబ్ధి చేకూర్చే విధంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టారు.
ఈ పథకం ద్వారా భూమి కలిగి ఉన్న రైతులు మరియు కౌలు రైతులు కూడా లబ్ధిని పొందుతారు.
ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హులను గుర్తించింది గాను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రక్రియ కొనసాగుతుంది.
లబ్ధిదారుల వెరిఫికేషన్ మరియు అప్రూవల్ పూర్తి అయిన తర్వాత ఈ పథకాన్ని వీలైనంత త్వరగా అమలు చేసేందుకు గాను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
🔥 జూన్ 12న లక్ష మందికి పైగా వితంతు, ఒంటరి మహిళలకు కొత్తగా పెన్షన్లు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఇంటి వద్దకే పెన్షన్ను అందజేస్తూ ఉంది.
ఇందులో భాగంగా ప్రభుత్వం ఏప్రిల్ నెల నుండి పెన్షన్ అమౌంట్ ను పెంపుదల చేసి గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తుంది.
స్పౌజ్ కేటగిరి ప్రవేశ పెట్టి పెన్షన్ లభిస్తూ మరణించిన భర్త యొక్క భార్యలకు వెనువెంటనే పెన్షన్ మంజూరు కార్యక్రమాన్ని తీసుకువచ్చింది.
అయితే గతంలో భర్త చనిపోయి ఉన్నా చాలామంది వితంతువులకు పెన్షన్ లబ్ధి చేకూర్చేందుకు మరియు ఒంటరి మహిళలుగా ఉన్న వారికి కూడా పెన్షన్ మంజూరు కొరకు అవకాశం కల్పించనుంది.
వీరికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించి ప్రభుత్వం ఏర్పడిన జూన్ 12వ తేదీ నాడు పెన్షన్ మంజూరు చేయనుంది.
మొత్తం ఒక లక్ష వితంతువులకు మరియు ఒంటరి మహిళలకు జూన్ 12వ తేదీ నాడు పెన్షన్లు మంజూరు చేయనుంది.
🔥 దీపం పథకంలో మార్పులు – ఉచిత సిలిండర్ల నగదు ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లోకి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న దీపం పథకంలో సమూల మార్పులు తీసుకొచ్చింది.
ప్రజలకు మరింత లబ్ధి చేకూరి విధంగా దీపం పథకం ను తీర్చిదిద్దారు.
దీపం పథకంలో భాగంగా ఇప్పటికే సంవత్సరానికి నాలుగు నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ చొప్పున మొత్తం మూడు సిలిండర్ లను ఉచితంగా అందజేస్తున్న విషయం అందరికీ విధితమే.
అయితే ప్రస్తుతం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకున్న తర్వాత ఆ నగదు మొత్తాన్ని ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది.
ఇకనుండి లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకున్నారా లేదా అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా మూడు సిలిండర్లకు సంబంధించిన నగదు మొత్తాన్ని లబ్ధిదారులు ఖాతాల్లో ముందుగానే జమ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీంతో పేద కుటుంబాలకు మరింత లబ్ధి చేకూరనుంది.
సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.