ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు ప్రకటించిన వేసవి సెలవులు మరికొద్ది రోజుల్లో ముగియనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో వేసవి సెలవులు నిమిత్తం సర్కులర్ రూపంలో పాఠశాలల యొక్క ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటించినప్పటికీ విద్యార్థులు మరియు తల్లిదండ్రులలో ఈ ప్రారంభ తేదీపై సందేహాలు ఉన్నాయి.
గతంలో ప్రకటించిన విధంగానే జూన్ 12వ తేదీ నాడే ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభం కానున్నాయని అధికారిక సమాచారం గా తెలుస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం సంబంధించి బడిబాట కార్యక్రమం యొక్క షెడ్యూల్ ను కూడా విడుదల చేయడం జరిగింది.
పాఠశాల ప్రారంభానికి సంబంధించి ఎటువంటి మార్పు లేదని, తల్లిదండ్రులు విద్యార్థులు ఈ అంశంపై ఎటువంటి నిర్ధారణలేని వార్తలను నమ్మవలసిన అవసరం లేదని విద్యాశాఖ తెలుపుతుంది. దీంతో పాటుగా విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు వివిధ సూచనలు తెలియజేసింది.
🏹 వివిధ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం మీ వాట్సాప్ కు రావాలి అంటే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
✅ Join Our What’s App Channel – Click here
🔥 జూన్ 12 న ఏపీ లో స్కూల్స్ ప్రారంభం :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ప్రకటించని షెడ్యూల్ ప్రకారమే స్కూల్ జూన్ 12వ తేదీన పునః ప్రారంభం కానున్నాయని విద్యాశాఖ వర్గాలు తెలియజేస్తున్నాయి.
ప్రైవేట్ స్కూల్లు మరియు ప్రభుత్వ స్కూల్లో అన్నీ కూడా పై సూచనను పాటించాల్సి ఉంటుంది.
🔥 ప్రభుత్వం స్కూల్ లలో అదే రోజున పుస్తకాల పంపిణీ :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూళ్లు ప్రారంభించిన రోజే ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాల పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- ఇందుకుగాను పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తూ అధికారులు అందరికీ కూడా ఈ అంశంపై సూచనలు జారీ చేస్తుంది.
- పెద్ద ఎత్తున పుస్తకాలు పంపిణీ, ఇటువంటి ఇబ్బంది లేకుండా సక్రమంగా జరగాలని ప్రభుత్వం ఆదేశించింది.
- దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి విద్యాధికారులు అందరికీ స్కూల్ హెచ్ఎం లకు పలు సూచనలు జారీ చేస్తుంది.
- రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.64 కోట్ల పుస్తకాలు పంపిణీ చేయాలని అంచనా వేయగా ఇందులో 1.24 కోట్ల పుస్తకాలు ఇప్పటికే గోడౌన్ లకు చేరాయని అధికారులు స్పష్టం చేశారు.
- ప్రస్తుతం 1.22 కోట్ల పుస్తకాలు మండల విద్యా కేంద్రాలకు పంపిణీ చేయబడ్డాయి. ఇంకా మిగతా పుస్తకాలు కూడా అతి త్వరలో స్కూల్ ప్రారంభానికి ముందే పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
🔥 జూన్ 06 నుండి జూన్ 19 వరకు బడిబాట కార్యక్రమం :
- ఈ విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 06 వ తేదీ నుండి జూన్ 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుంది.
- ఇందులో భాగంగా జూన్ 6వ తేదీన గ్రామసభ నిర్వహిస్తారు & జూన్ 7వ తేదీన బడి ఈడు పిల్లలందరినీ గుర్తిస్తారు.
- జూన్ 8వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు ఇంటింటి ప్రచారంలో భాగంగా కరపత్రాలతో ప్రతి ఇంటిని సందర్శిస్తారు అలానే అంగన్వాడి కేంద్రాలను కూడా సందర్శిస్తారు.
- డ్రాప్ అవుట్ బాక్స్ లో ఉన్న విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులను గుర్తించి భవిత కేంద్రాల్లో చేరుస్తారు.
- జూన్ 6వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు నిర్వహించిన కార్యక్రమాలపై జూన్ 11వ తేదీన సమీక్ష నిర్వహిస్తారు.
- స్కూళ్లు ప్రారంభించే 12వ తేదీన పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు , నోటు పుస్తకాలు , యూనిఫాములను అందించాల్సి ఉంటుంది.
- జూన్ 13వ తేదీన సామూహిక అక్షరాభ్యాసం మరియు బాలల సభను నిర్వహిస్తారు.
- జూన్ 16వ తేదీన FLN & LIP దినోత్సవం నిర్వహిస్తారు.
- జూన్ 17 వ తేదీన విలీన విద్య ,బాలిక విద్యా దనోత్సవాన్ని నిర్వహిస్తారు.
- జూన్ 18వ తేదీన తరగతి గదుల డిజిటలీకరణ పై అవగాహన, మొక్కల పెంపకం ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేస్తారు.
- జూన్ 19వ తేదీన బడిబాట చివర రోజు కావున విద్యార్థులకు క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
🔥 పాఠశాలల ప్రారంభానికి విద్యార్థులు & తల్లిదండ్రులు ఈ విధంగా సిద్ధంకండి:
- సుమారు 50 రోజుల వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు స్కూలుకు వెళ్లేందుకు నిరాకరించే అవకాశం ఉంది.
- అయితే విద్యార్థులు స్కూలు ప్రాధాన్యతను గుర్తించి ఖచ్చితంగా స్కూల్లకు వెళ్లడం ప్రారంభించాలి.
- స్కూల్ యూనిఫామ్ స్టేషనరీ వంటి వివిధ అంశాలన్నింటిని కూడా ఖచ్చితంగా ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలి.
- ఈ విద్యాసంస్థలకు సంబంధించి పార్టీ పుస్తకాలు నోటు పుస్తకాలను జాగ్రత్త చేసుకోవాలి.
🔥 పాఠశాలలకు సంబంధించి ముఖ్యమైన అంశాలు :
- వేసవి సెలవులు పూర్తి – జూన్ 11, 2025.
- పాఠశాలలు ప్రారంభం – జూన్ 12, 2025.
- పని దినాలు (వర్కింగ్ డేస్) – సోమవారం నుండి శనివారం వరకు.
- ప్రతిరోజు తరగతి సమయం – ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు.
- ప్రతి ఆదివారం సెలవు.