ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ , డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ వారి నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, అనంతపురం వారి పరిధిలో పనిచేయవలసి వుంటుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో భాగంగా బయో మెడికల్ ఇంజనీర్, రేడియోగ్రాఫర్, ఆడియో మెట్రీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, సైకోథెరపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్, GDA /MNO / FNO , ప్లంబర్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాధిపతికన భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు ఎటువంటి వ్రాత పరిక్ష , ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలను నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా రాష్ట్రీయ బాల్ స్వాస్త్య కార్యక్రమం లో భాగంగా బార్థించేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి , అవసరమగు విద్యార్హతలు , దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు ను పూర్తిగా తెలుసుకొనేందుకు గాను ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
Andhra Pradesh Outsourcing ok Notification 2025 :
🏹 NTR హెల్త్ యునివర్సిటీ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ , అనంతపురం వారి నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 43 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- బయో మెడికల్ ఇంజనీర్
- రేడియోగ్రాఫర్
- ఆడియో మెట్రీషియన్
- ల్యాబ్ టెక్నీషియన్
- సైకోథెరపిస్ట్
- రికార్డ్ అసిస్టెంట్
- ఆఫీస్ సబార్డినేట్
- ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్
- ల్యాబ్ అటెండెంట్
- పోస్టుమార్టం అసిస్టెంట్
- GDA/MNO/FNO
- ప్లంబర్
🔥 విద్యార్హత :
- పోస్టులను అనుసరించి విద్యార్హతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

🔥 వయస్సు :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయు అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు వుండాలి.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయసడలింపు కలదు.
- ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు లభిస్తుంది
🔥దరఖాస్తు విధానం :
- ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకునేందుకుగాను అప్లికేషన్ ప్రొఫార్మాను 21.05.2025 నుండి 28.05 2025 వరకు అధికారికి వెబ్సైట్లో ప్రొఫార్మాను అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు ప్రొఫార్మాను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకొని ఫిల్ చేసి సంబంధిత ధ్రువపత్రాలు జత చేసి క్రింద పేర్కొన్న కార్యాలయానికి ఆఫ్లైన్ విధానం ద్వారా అందజేయాలి.
- 28.05.2025 సాయంత్రం ఐదు గంటల్లోగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
🔥 దరఖాస్తు పంపించవలసిన చిరునామా:
- District Coordinator of Hospital Services, Ananthapuramu.
🔥 అవసరమగు ధృవపత్రాలు :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పూరించిన దరఖాస్తుతో పాటుగా క్రింద పేర్కొన్న ధ్రువపత్రాలు రెండు సెట్లు దరఖాస్తుతో జత చేయాలి.
- 10వ తరగతి సర్టిఫికెట్
- అన్ని విద్యార్హతలు సర్టిఫికెట్లు
- కౌన్సిల్ / బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
- ఇటీవల కుల దృవీకరణ పత్రం
- 4 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు గల స్టడీ సర్టిఫికెట్లు
- సదరం సర్టిఫికెట్ (అవసరమగు వారు)
- EWS సర్టిఫికెట్ (అవసరమగు వారు)
- స్పోర్ట్స్ సర్టిఫికెట్ (అవసరమగు వారు)
- సర్వీస్ సర్టిఫికెట్ (అవసరమగు వారు)
- డిమాండ్ డ్రాఫ్ట్
- పైన పేర్కొన్న ధృవపత్రాలు యొక్క సెల్ఫ్ అటిస్టెడ్ చేసి దరఖాస్తుకి జత చేయాల్సి ఉంటుంది.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులకు ఎటువంటి వ్రాత పరిక్ష , ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
- నోటిఫికేషన్ కి సంబంధించి విడుదల చేసే మెరిట్ లిస్ట్ ఒక సంవత్సర కాల పరిమితితో అందుబాటులో ఉంటుంది.
- అకడమిక్ విద్యార్హత లో మార్కులకు 75 శాతం వెయిట్ఏజ్, 15 శాతం గత అనుభవం కి, 10 శాతం విద్య లో సీనియారిటీ కి కేటాయించారు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- అభ్యర్థులు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- ఓసి, బిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 500/- రూపాయలు & ఎస్సీ, ఎస్టీ 300/- రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
- దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు కలదు.
- డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అనంతపురం వారి పేరు మీదుగా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
🔥 జీతం :
- బయో మెడికల్ ఇంజనీర్ ఉద్యోగానికి ఎంపిక కాబడిన వారికి 54,060/- రూపాయలు జీతం లభిస్తుంది.
- వీడియో గ్రాఫర్ ఉద్యోగానికి ఎంపికైన వారికి 35,570/- రూపాయలు జీతం లభిస్తుంది.
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 మరియు ఆడియో మెట్రీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 32,670/- రూపాయల జీతం లభిస్తుంది.
- ఫిజియోథెరపిస్ట్ గా ఎంపికైన వారికి 21,500/- రూపాయల జీతం లభిస్తుంది.
- ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, ల్యాబ్ అటెండెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్ GDA/ MNO / FNO, ప్లంబర్ గా ఎంపిక అయిన వారికి నెలకు 15,000/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
- నోటిఫికేషన్ విడుదల తేదీ : 19/05/2025
- దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 21/05/2025
- దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 28/05/2025
- దరఖాస్తులను స్క్రుటినిటీ చేయు తేదీ : 10/06/2025
- తాత్కాలిక మెరిట్ జాబితాలను విడుదల చేయు తేదీ : 14/06/2025
- ప్రొవిజనల్ మెరిట్ జాబితా పై గ్రీవెన్స్లు స్వీకరణ తేదీలు : 16/06/2025 నుండి 19/06/2025
- ఫైనల్ మెరిట్ జాబితా మరియు సెలక్షన్ జాబితాలు విడుదల చెయు తేదీ : 25/06/2025
- ఎంపిక కాబడిన అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహణ మరియు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చుట : 01/07/2025
👉 Click here to download notification and application
👉 Click here for official website