ఏపీపీఎస్సీ నుండి విద్యా శాఖలో ఆఫీసర్ పోస్టుల భర్తీ | APPSC DY EO Notification in Telugu | APPSC Deputy Educational Officer Notification 2023

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ డిసెంబర్లో ఏపీపీఎస్సీ నుంచి విడుదల చేసిన నాలుగవ నోటిఫికేషన్ ఇది. 

దాదాపు 17 ఏళ్ల తరువాత ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఇటీవల ఏపీపీఎస్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రూప్ 1 , గ్రూప్ 2 , పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్లు నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యా శాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ నోటిఫికేషన్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇

ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు.  ఈ పోస్టులు జోన్ల వారీగా భర్తీ చేస్తున్నారు.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

🔥 పోస్టుల పేర్లు : డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 38

జోన్ల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి.

జోన్ 1 – 07

జోన్ 2 – 12

జోన్ 3 – 08

జోన్ 4 – 11

🔥 అర్హత : బిఈడి కోర్సులో అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉన్న సబ్జెక్ట్ ల్లో పోస్ట్ గ్రాడ్యుకేషన్ లో ఫస్ట్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. 

🔥 ఎంపిక విధానం : ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ ఆధారంగా

🔥 అప్లై విధానం : APPSC అధికారిక వెబ్సైట్ లో

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 09-01-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 29-01-2024

🔥 జీతము : 61,960/ – 1,51,370/- 

🔥 వయస్సు : 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు మేరకు ఎస్సీ, ఎస్టీ,  బీసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల సడలింపు కలదు. మరియు PH అభ్యర్థులకు పదేళ్ల సడలింపు కలదు .

🔥 ఫీజు : జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ప్రొసెసింగ్ ఫీజు 250/-  మరియు పరీక్ష ఫీజు 120/-   

ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 250/- (వీరికి పరీక్ష ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు) 

🔥 ఈ ఉద్యోగాలకు ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమ్స్ , మెయిన్స్ పరీక్ష పెట్టి ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి , ఎంపికైన అభ్యర్థులకు ఆఫీస్ ఆటోమేషన్ ప్రొఫెషియన్సీ పరీక్ష నిర్వహిస్తారు

ప్రిలిమ్స్ లో 150 ప్రశ్నలు 150 మార్కులకు ఇస్తారు. 150 నిమిషాల సమయం ఇస్తారు.

మెయిన్స్ పరీక్ష మొత్తం 300 మార్కులకు ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.  ఒకటవ పేపర్ లో 150 ప్రశ్నలు ,150 మార్కులు కు ఇస్తారు. రెండవ పేపర్లో 150 ప్రశ్నలు 150 మార్కులు కి ఇస్తారు.  ప్రతీ ప్రశ్నకు ఒక మార్కు, ప్రతి తప్పు సమాధానానికి 1/3 రుణాత్మక మార్కింగ్ విధానం ఉంది.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *