ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం | NTR Vidya Sankalpam Scheme Details | NTR Vidya Sankalpam Qualification

ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం వివరాలు
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త పథకం అమలు చేసేందుకు గాను కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో విద్యకు ప్రాధాన్యమిస్తూ వివిధ కార్యక్రమాలను ప్రారంభించిన రాష్ట్రం ఇందులో భాగంగా ఎన్టీఆర్ విద్యా సంకల్పం అనే పేరుతో మరో పథకాన్ని అమలు చేయనుంది.

ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలకు విద్యను అభ్యసిస్తున్న పిల్లలు ఉంటే వారికి అతి తక్కువ వడ్డీతో రుణం కల్పించే విధంగా ఈ పథకం రూపొందించారు.

ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకానికి సంబంధించి ఈ పథకానికి ఎవరు అర్హులు ? ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది ? విధివిధానాలు ఏమిటి ? వంటి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥 ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం అనగా ఏమిటి ? :

  • రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలు చదువుకుంటున్న పిల్లలను కలిగి ఉన్నవారు ఆ విద్యార్థుల విద్య సక్రమంగా కొనసాగించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ఆ మహిళలకు నాలుగు శాతం వడ్డీతో రుణకల్పన చేయనుంది.
  • గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) విభాగం ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకానికి గాను నోడల్ డిపార్ట్మెంట్.
ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం వివరాలు

🔥 ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకాన్ని ఎందుకు అమలు చేస్తున్నారు ?

  • పిల్లలను చదివేందుకు తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుండా , వారు అధిక వడ్డీతో ప్రైవేట్ సంస్థల వద్ద , వ్యక్తులు వద్ద రుణాలను తీసుకుని అప్పుల ఊబిలోకి పోకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రమ గతమైన లోన్ మంజూరు చేయడం ద్వారా వారికి భరోసా కల్పించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు.

🔥 ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం ద్వారా ఏ విధంగా లబ్ధి చేకోరుతుంది :

  • ఈ పథకం ద్వారా డ్వాక్రా సంఘాల ఉన్న మహిళలకు నాలుగు శాతం వడ్డీతో అనగా 35 పైసలు వడ్డీతో పదివేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు రుణం అందిస్తారు.
  • SERP డిపార్ట్మెంట్ ఇప్పటికే అమలు చేస్తున్న స్త్రీ నిధి పథకం కి అనుసంధానంగా ఎన్టీఆర్ విద్యాసంకల్పం పథకం అమలు కానుంది.
  • స్త్రీ నిధి పథకం ద్వారా 11 శాతం వడ్డీతో రుణాలు మంజూరు చేస్తుండగా , ఎన్టీఆర్ విద్యా సంకల్పం ద్వారా నాలుగు శాతం వడ్డీతో రుణాలు మంజూరు చేయడం ఈ పథకం యొక్క ప్రత్యేకత.

🔥 ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం యొక్క విధి విధానాలు :

  • ఈ పథకం అమలు కొరకు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపియున్నారు. ఈ పథకాన్ని మరికొద్ది రోజులలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుంది .
  • ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు ఈ విధంగా ఉన్నాయి.
  • డ్వాక్రా సంఘాలలో గల మహిళలు వారికి చదువుకుంటున్న పిల్లలు ఉంటే ఈ పథకంలో నమోదయ్యేందుకు అర్హత కలిగి ఉన్నట్లే.
  • విద్యార్థులు ఒకటవ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మధ్య చదువుతూ ఉండాలి.
  • ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాల నందు ఎక్కడ చదివినా సరే ఈ పథకానికి అర్హులే.
  • స్త్రీనిధి కార్యక్రమానికి అనుసంధానంగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా పదివేల రూపాయల నుండి లక్ష రూపాయలు వరకు రుణం మంజూరు అవుతుంది. వడ్డీ కేవలం నాలుగు శాతం మాత్రమే ఉంటుంది.
  • రుణాన్ని కనీసం 24 నెలలలో గరిష్టంగా 36 నెలల్లోగా వాయిదాల రూపంలో చెల్లించాలి.
  • తీసుకున్న రుణాన్ని కేవలం విద్యార్థుల యొక్క విద్యకు సంబంధించిన అంశాలు అయిన యూనిఫామ్ , పుస్తకాలు , ఫీజు చెల్లింపులు , విద్యకు సంబంధించిన ఇతర అంశాలకు మాత్రమే ఖర్చు చేయాలి. ఇందుకు తగిన రసీదులను కూడా అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది.
  • విద్యార్థుల రవాణా సౌకర్యం నిమిత్తం సైకిల్ కొనుగోలు కు కూడా ఈ పథకం ద్వారా అవకాశం కల్పించారు.
  • ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు SERP అధికారులను డ్వాక్రా స్త్రీ నిధి అధికారులను సంప్రదించవచ్చు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు నోటిఫికేషన్ల యొక్క సమగ్ర సమాచారం కొరకు మన పేజీ ను ఫాలో కాగలరు.

గమనిక :

  • ఇలాంటి మరికొన్ని పథకాల సమాచారం కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.

అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల అకౌంట్లో 20,000/- జమ – Click here

ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పడలేదా అయితే ఇలా చేయండి – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *