ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు సంక్షేమ పథకాల అమలు కొరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళల సంక్షేమం కొరకు కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా గ్రూపులకు స్త్రీ నిధి పథకం ద్వారా రుణాలు అందిస్తుండగా , ఇప్పుడు స్త్రీనిధి పథకం ద్వారానే పిల్లల చదువుకు మరియు ఆడపిల్లల వివాహాలకు పావన వడ్డీకి రుణాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాలను ఎన్టీఆర్ విద్యాలక్ష్మి మరియు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అనే పేర్లతో అమలు చేయనున్నారు.
ఏమైనా అనుకోని కారణాల చేత ఈ పథకం ద్వారా రుణాన్ని పొందిన తర్వాత ఆ సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణించిన , ఆ రుణ మొత్తాన్ని మాఫీ చేయనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో అమలు చేయనున్న ఈ సంక్షేమ పథకాలకు ఎవరు అర్హులు ? లబ్ధి ఏ విధంగా చేకూరుతుంది ? ఈ శంషాబాద్ అమలు ఏ విధంగా ఉంటుంది వంటి వివిధ అంశాల సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
Table of Contents :
🔥 రాష్ట్రంలో కొత్తగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి మరియు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి సంక్షేమ పథకాలు :
- కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో గల స్వయం సహాయక సంఘాల్లో ఉన్న సభ్యులకు లబ్ధి చేకూర్చేలా రెండు కొత్త పథకాలను అమలు చేయనున్నారు.
- ఆర్థికంగా అవసరానికి అనుగుణంగా రుణం మంజూరు చేసే విధంగా ఈ రెండు పథకలు ఉన్నాయి.
- స్వయం సహాయక సంఘాలలో గల సభ్యుల పిల్లల చదువుల కొరకు ఆర్థికంగా అండగా ఉండేందుకుగాను ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం మరియు ఆడపిల్ల వివాహాల కు సహకారం అందించింది గను ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్ టి ( SERP) ద్వారా అమలు చేస్తున్నారు.
- ఈ పథకాల ద్వారా SERP యొక్క అనుబంధ పథకం స్త్రీ నిధి ద్వారా మహిళలకు పావలా వడ్డీకి లక్ష రూపాయలు రుణాన్ని అందిస్తారు.
🔥ఎన్టీఆర్ విద్యాలక్ష్మి మరియు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలకు అర్హులు ఎవరు ? :
- ఈ పథకాలను పొందేందుకు గాను స్వయం సహాయక సంఘాల సభ్యులకు ( డ్వాక్రా గ్రూప్ సభ్యులు ) అర్హత వుంటుంది. అయితే వారు సంఘం లో సభ్యులు అయి కనీసం 6 నెలలు పూర్తి అయి ఉండాలి.
- అలానే గతంలో బ్యాంకు లింకేజీ , స్త్రీ నిధి మరియు ఇతర రుణ పథకాల ద్వారా రుణాన్ని పొంది , ఆ రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తూ ఉండాలి.
- రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి మరియు ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి పథకాలను బయోమెట్రిక్ ఆధారంగా అమలు చేయనుంది.
🔥 ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం లబ్ధి :
- రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి సంబంధించి అర్హత కలిగి ఉన్న లబ్ధిదారులు ఈ క్రింది సదుపాయాలను పొందుతారు.
- ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా గరిష్టంగా ఇద్దరు పిల్లల చదువులకు ఆర్థిక సహాయం చేస్తారు.
- ఈ పథకం ద్వారా పాఠశాలలు మరియు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల యొక్క ఫీజుల చెల్లింపు కొరకు అవసరమైన నగదును నాలుగు శాతం వడ్డీతో పొందవచ్చు.
- ఈ పథకం ద్వారా పదివేల రూపాయల నుండి గరిష్టంగా లక్ష రూపాయల వరకు రుణాన్ని పొందే అవకాశం కల్పిస్తారు.
- ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారు , తీసుకున్న రుణ పరిమితి ఆధారంగా వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాలి.
- గరిష్టంగా 48 వాయిదాల లో రుణాన్ని తిరిగి చెల్లించాలి.
- అర్హత కలిగిన వారు ఈ రుణానికి దరఖాస్తు చేసుకున్న 48 గంటల లోగా రుణాన్ని పొందుతారు.
- బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తారు.
🔥 ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కొరకు అవసరమగు పత్రాలు :
- ఈ పథకం ద్వారా రుణాన్ని పొందేందుకు గాను ఈ క్రింది పత్రాలు అవసరమవుతాయి.
- అడ్మిషన్ లెటర్
- పాఠశాల / కళాశాల వివరాలు
- ఫీజు చెల్లింపు వివరాలు
🔥 ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం లబ్ది :
- ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి పథకాన్ని పొందేందుకుగాను అర్హత కలిగిన లబ్ధిదారులకు ఈ క్రింది సదుపాయాలు లభిస్తాయి.
- డ్వాక్రా సంఘం లో సభ్యురాలు అయిన మహిళ యొక్క కుమార్తె వివాహానికి సంబంధించిన పథకం ఇది.
- ఈ పథకం ద్వారా పదివేల రూపాయల నుండి గరిష్టంగా ఒక లక్ష రూపాయలు వరకు రుణం మంజూరు చేస్తారు. అవసరాన్ని బట్టి లక్ష రూపాయల లోపు ఎంత మొత్తాన్ని అయినా తీసుకోవచ్చు.
- ఈ పథకానికి కూడా కేవలం నాలుగు శాతం వడ్డీని చెల్లించి రుణాన్ని పొందే అవకాశాన్ని కల్పించారు.
- గరిష్టంగా 48 వాయిదాలలో రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అయితే తీసుకున్న రుణం ఆధారంగా రుణ వాయిదాలను నిర్ణయిస్తారు.
- ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు సమర్పించిన వివరాలను పరిశీలించి నగదు మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.
🔥 ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం కొరకు అవసరమగు పత్రాలు :
- ఈ పథకం ద్వారా రుణం పొందేందుకు గాను ఈ క్రింది పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
- లగ్న పత్రిక
- ఈవెంట్ నిర్వహణ కి సంబంధించిన పత్రం
- పెళ్లి ఖర్చును అంచనా వేస్తూ వ్యయ పత్రం
🔥 ప్రతిష్టాత్మకంగా అమలు – సంవత్సరానికి ₹2,000 కోట్లు ఖర్చు :
- రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు పథకాలను ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.
- ఈ పథకాలను అమలు చేసేందుకు గాను ఒక్కొక్క పథకానికి వెయ్యి కోట్ల చొప్పున రెండు పథకాలకు కలిపి మొత్తం సంవత్సరానికి ₹2,000 కోట్లు అవసరం అవుతాయి.
- ఈ పథకాలు అమలు చేయడం కొరకు పావలా వడ్డీ ద్వారా వచ్చే మొత్తంలో 50 శాతం మండల మహిళా సమైక్య లు మరియు గ్రామ సమైక్య ల నిర్వహణ మరియు వాటి బలోపేతం చేసేందుకు ఉపయోగిస్తారు.
- మిగతా 50 శాతం ను స్త్రీ నిధి పథకం ను అమలు చేస్తున్న ఉద్యోగుల సంక్షేమం కొరకు వారి ప్రయోజనాల కొరకు ఉపయోగిస్తారు.
