యూనిక్ ఐడెంటిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) సంస్థ ఇటీవల ఆధార్ కార్డు లకు , ఆధార్ సేవలకు సంబంధించి పలు అప్డేట్ లను జారీ చేస్తుంది. కొత్త గా పొందే ఆధార్ కార్డులకు అవసరమగు ధ్రువపత్రాలు ఏమిటి ? ఆధార్ కార్డు లో గోప్యతా ప్రమాణాల దృష్ట్యా డేట్ ఆఫ్ బర్త్ ను పూర్తిగా ఇక నుండి ఇవ్వకపోవడం వంటి పలు నిర్ణయాలను ఇప్పటికే ప్రకటించిన UIDAI సంస్థ ఇప్పుడు బాల ఆధార్ ను పొందేందుకు గాను ప్రక్రియను సులభతరం చేస్తున్నట్లు ప్రకటించింది.
✅ Join Our What’sApp Group – Click here
🔥 బాల ఆధార్ మరింత సులువు & శిశు ఆధార్ సేవా కేంద్రాలు ఏర్పాటు
- UIDAI సంస్థ చిన్న పిల్లలు కి ఆధార్ ఇచ్చేందుకు కొత్త విధానాన్ని తీసుకువస్తుంది.
- చిన్న పిల్లలకు ఆధార్ కొరకు తల్లిదండ్రులు పడే కష్టాలను తొలగించాలని భావిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ద్వారా ఈ విధానాన్ని తెస్తుంది.
- ఈ విధానం ద్వారా పిల్లలు పుట్టిన వెంటనే ఆధార్ జారీ చేయాలని అదేశాలు జారీ చేసింది.
- జన్మించిన శిశువు యొక్క బర్త్ సర్టిఫికెట్ మరియు తల్లిదండ్రుల బయోమెట్రిక్ ఆధారంగా ఆధార్ లను ఉచితంగా ఇచ్చేందుకు గాను శిశు ఆధార్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయనుంది.
- ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు (PHC) , అంగన్వాడి కేంద్రాలు , గ్రామ , వార్డు సచివాలయం లలో ప్రత్యేకంగా శిశు ఆధార్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
- ఈ నిర్ణయం తో బాల ఆధార్ సులువుగా లభించడం తో పాటు గా , తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకు ఆధార్ చేయించుకోవడం లో ఇబ్బందులు తొలగనున్నాయి..