ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సరఫరాలకు సంబంధించి ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకువచ్చింది. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలను నివారించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తూ, ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న రేషన్ వ్యాన్లు ద్వారా రేషన్ పంపిణీ జరగబోదు అని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలియజేశారు.
AP Ration Door Delivery Scheme Cancelled :
ఇటీవల జరిగిన క్యాబినెట్ మంత్రివర్గ భేటీ యొక్క నిర్ణయాలను మీడియాకు తెలియజేస్తూ మంత్రిగారు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.
✅ ప్రభుత్వ పథకాల సమాచారం మీ ఇంటికే రావాలి అంటే మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి..
🏹 Join Our What’s Group – Click here
🔥 జూన్ 1 నుండి రేషన్ షాప్ ల ద్వారా రేషన్ పంపిణీ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన రేషన్ వ్యాన్ ల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని పునః పరిశీలించి, రేషన్ వ్యాన్ల ద్వారా రేషన్ ను పంపిణీ చేయడం జరగదని పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలియజేశారు.
జూన్ 1వ తేదీ నుండి రేషన్ షాపుల ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ జరుగుతుంది అని ప్రకటించారు.
ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ షాపుల వద్ద రేషన్ పంపిణీ కార్యక్రమం సజావుగా జరగనుందని తెలియజేశారు.
🏹 AP లో మహిళాభివృద్ది & శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు – Click here
🔥 వీరికి ఇంటింటికి రేషన్ పంపిణీ జరుగుతుంది :
అయితే రేషన్ వ్యాన్ల ద్వారా రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు నిర్ణయాన్ని ప్రకటిస్తూ, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు మరియు దివ్యాంగులకు మాత్రం ఇంటి వద్దనే డోర్ డెలివరీ ద్వారా రేషన్ పంపిణీ జరుగుతుందని సమాచారం అందించారు.
🔥 అవకతవకలు లేకుండా రేషన్ పంపిణీ :
ప్రస్తుతం ఉన్న చౌక ధరల దుకాణాలలో ఏటువంటి లోటుపాట్లు లేకుండా రేషన్ పంపిణీ జరగనుంది.
ఇందుకుగాను ప్రభుత్వం సరికొత్త యాప్ ను డిజైన్ చేయడం జరిగింది. దీనితోపాటుగా మరికొద్ది రోజుల్లో ప్రతి రేషన్ షాప్ లోను సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నారు.
కేంద్ర ప్రభుత్వ అనుమతులతో ప్రతి రేషన్ షాపులు పేదవారికి అణువుగా ఉండే కిరాణా షాపులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలియజేశారు.
ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక అనుమతులతో రేషన్ షాపులలో వివిధ సర్వీస్ లను అందించనున్నారు. గిరిజన ఉత్పత్తులు కేంద్ర ప్రభుత్వ భారత్ ఉత్పత్తుల్లో తక్కువ ధరలకు వినియోగదారులకు అందించనున్నారు.
🔥 ఉచితంగా రేషన్ వ్యాన్ ల పంపిణీ :
ఇప్పటివరకు రేషన్ పంపిణీకి వినియోగిస్తున్న రేషన్ వ్యాన్లను ప్రస్తుతం ఆ రేషన్ వ్యాన్లు ఎవరు పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయో వారికి ఉచితంగా అందిస్తారు.
వీరు జీవనోపాధిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ రేషన్ వ్యానులను సరుకుల రవాణా కొరకు మరియు ఇతర వినియోగాల కొరకు అందజేస్తున్నారు.
గతంలో వీరికి వ్యాన్లను మంజూరు చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ కార్పొరేషన్ ల ద్వారా వీరికి ఈ వ్యాన్లు అందించేందుకు ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి గారు తెలియజేశారు.