ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 12వ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. ఈ విద్యా సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడిలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ , కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో పోషకాలతో కూడిన భోజనాన్ని అందించేందుకు గాను నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పోషకాలతో కూడిన సన్న బియ్యాన్ని అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
✅ తల్లికి వందనం పథకం అర్హులు, అనర్హులు జాబితా విడుదల – Click here
ఇప్పటికే రేషన్ పంపిణీలో పలు మార్పులను తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ స్కూల్స్ మరియు హాస్టల్ అందించే భోజనం పై కీలక మార్గదర్శకాలు జారీ చేస్తుంది.
ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 మధ్యాహ్న భోజనంతో విద్యార్థులకు పోషకాహారం :
- రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా విద్యార్థులందరికీ కూడా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.
- అలానే ప్రభుత్వ హాస్టల్స్ , కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు వంటి సంస్థలలో కూడా ప్రతిరోజు మూడు పూటలా భోజనాన్ని అందిస్తున్నారు.
- విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించిందిగాను రాష్ట్ర ప్రభుత్వం గతంలో పంపిణీ చేసిన బియ్యం స్థానంలో పోషకాలతో కూడిన సన్నబియాన్ని అందించేందుకుగాను నిర్ణయం తీసుకుంది. స్కూల్ లు పునః ప్రారంభించే తేదీ అయిన జూన్ 12వ తేదీ నుండి ఈ సన్న బియ్యం భోజనమును ను విద్యార్థులందరికీ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది .
- ఇందుకు గాను పోషకాలతో కూడిన ఈ సన్నబియ్యాన్ని 25 కేజీల చొప్పున ప్యాక్ చేసి స్కూళ్లకు , హాస్టళ్లకు పంపిణీ చేస్తారు.
🔥 ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పథకం అమలు :
- రాష్ట్రంలో గతంలో ఒకటవ తరగతి నుండి 10వ తరగతి వరకు మాత్రమే మధ్యాహ్న భోజనం పథకం అమలులో ఉంది. ప్రస్తుతం రాష్ట్రం ఈ పథకాన్ని విస్తరించాలి అనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కూడా ఇందులో భాగంగా తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కూడా పోషకాలతో కూడిన సన్న బియ్యం భోజనమును వారు మెనూలో భాగంగా అందించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి.