ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఆఫీసర్ గ్రేడ్ ఉద్యోగం పొందేందుకు గాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సంస్థ ప్రతి సంవత్సరం విడుదల చేసే విధంగా 2025 సంవత్సరంలో కూడా కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
అతి చిన్న వయస్సులో రక్షణ రంగంలో అధికారి హోదా ఉద్యోగం కల్పించడం తో పాటు బీటెక్, బిఎస్సి, బిఎ కోర్సులను కూడా చదువుకుంటూ శిక్షణను పూర్తి చేయవచ్చు. శిక్షణ అనంతరం వీరు ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ అనగా త్రివిధ దళాలలో లెవెల్ 10 అధికారిగా ఉద్యోగం చేయవచ్చు.
దేశ సేవలో భాగం కావాలి అనుకునే అభ్యర్థులకు ఈ CDS నోటిఫికేషన్ ఒక మంచి అవకాశం.
CDS నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 ఖాళీల వివరాలు :
- మొత్తం 453 ఖాళీలను గుర్తించారు. ఇందులో
- ఇండియన్ మిలటరీ అకాడమీ, డెహ్రాడూన్ – 100
- ఇండియన్ నేవల్ అకాడమీ , ఈజిమల – 26
- ఎయిర్ ఫోర్స్ అకాడమీ , హైదరాబాద్ – 32
- ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ , చెన్నై – 276 (for men)
- ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ , చెన్నై – 19 ( for women)
🔥వయోపరిమితి :
- ఇండియన్ మిలిటరీ అకాడమీ మరియు ఇండియన్ నేవెల్ అకాడమీ లో అడ్మిషన్ కొరకు జూలై 2 2002 నుండి జూలై 1 2007 మధ్య జన్మించిన వారు అర్హులు.
- ఎయిర్ ఫోర్స్ అకాడమీ లో అడ్మిషన్ పొందేందుకుగాను 24 సంవత్సరాలపు వయస్సు కలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అనగా జూలై 1 2026 నువ్వు కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
🔥దరఖాస్తు విధానం :
- దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్లో జూన్ 17, 2025వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
🔥దరఖాస్తు ఫీజు :
- అభ్యర్థులు 200 రూపాయల దరఖాస్తు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ , ఎస్టీ , మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు కలదు.
🔥ఎంపిక విధానం:
- ఈ నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఓఎంఆర్ తర్వాత పరీక్ష మరియు ఇంటిలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ , ఇంటర్వ్యూ మరియు మెడికల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
- రాత పరీక్షను సెప్టెంబర్ 14 , 2025 నాడు నిర్వహించనున్నారు.
🔥 పరీక్షా కేంద్రాలు :
- దేశం లోని పలు ప్రముఖ నగరాల తో పాటు తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్, విజయవాడ, విశాఖపట్నం మరియు తెలంగాణ లోని హైదరాబాద్, హనుమకొండ లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
🔥ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 17/06/2025
- రాత పరీక్ష నిర్వహణ తేదీ: 14/09/2025