Free Bus Scheme : ఆగస్ట్ 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలందరికీ ఒక మంచి శుభవార్తను అయితే తెలియజేశారు. సూపర్ సిక్స్ పథకాలలో ప్రధాన హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ను ఆగస్టు 15వ తేదీ నుండి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది.
ఇది కాకుండా వివిధ పథకాలకు సంబంధించి మరింత సమాచారాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేశారు.
పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికలను చివరి వరకు చదవండి.
🏹 ఆంధ్ర ప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here
🔥 ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం :
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు కర్నూలు లో శనివారం నిర్వహించబడిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయన వివిధ అంశాలను ప్రస్తావించారు అందులో భాగంగా సూపర్ సిక్స్ హామీలను ప్రధాన హామీ అయిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ను ఆగస్టు 15వ తేదీ నుండి అమలు చేస్తామని తెలియజేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలకు ఇచ్చిన హామీ మేరకు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పంద్రాగస్టు కానుకగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలియజేయడం జరిగింది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం ద్వారా ఆ కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గుతుందని రవాణా శాఖ మాత్యులు రాంప్రసాద్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఈ పథకం అమలు తేదీని ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి గారు ఒక బలమైన అడుగు వేశారని పేర్కొన్నారు.
🔥 జూన్ నెలలో తల్లుల ఖాతాలోకి తల్లికి వందనం నగదు :
ఒకటి నుంచి ఇంటర్మీడియట్ లోపు చదువుతున్న విద్యార్థుల యొక్క తల్లులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం అనే పథకం ద్వారా లబ్ధి చేకూర్చునుంది.
ఈ పథకం ద్వారా ఒక్కొక్క విద్యార్థికి 15,000/- చొప్పున తల్లులు ఖాతాలో జమ చేస్తుంది.
ఈ పథకాన్ని జూన్ నెలలో ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి గారు తెలియజేశారు.
🔥 దీపం పథకం ద్వారా నేరుగా లబ్ది :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి అమలు చేస్తున్న దీపం పథకంలో మార్పులు చేసింది.
గతంలో లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకుని ఆ గ్యాస్ సిలిండర్ ను పొందిన తర్వాత ఆ డబ్బులను రిఫండ్ చేసేది అయితే ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని రిఫండ్ రూపం లో కాకుండా పూర్తిగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోకపోయినా , బుక్ చేసుకున్న ముందుగానే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి లబ్ధిదారులు ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనుంది.