ఆంధ్ర బ్యాంక్ & యూనియన్ బ్యాంక్ లలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు | Union Bank Of India LBO Recruitment 2024 | Union Bank Local Bank Officer Jobs 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం చేయాలి అనుకునే వారికి సువర్ణ అవకాశం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 1500 ఖాళీలతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్ట్లు ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ఉద్యోగాలకు సమానమైన హోదా కలిగి ఉంటాయి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉంటే సరిపోతుంది. ఎంపికైన వారికి రెండేళ్లపాటు శిక్షణ కాలం ఉంటుంది.

ఎంపికైన వారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో పనిచేయవచ్చు. (2020 సంవత్సరంలో ఆంధ్ర బ్యాంకు ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే).

మొత్తం 1500 పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఖాళీలు ఉన్నాయి. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లోనే పోస్టింగ్ పొందవచ్చు. 

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. అలానే మరిన్ని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు , ప్రైవేటు జాబ్ అప్డేట్స్ కోసం మా “ www.inbjobs.com “ వెబ్సైట్ ప్రతిరోజు ఓపెన్ చేయండి.

🏹 ShareChat లో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 1500

  • ఆంధ్రప్రదేశ్ లో 200 పోస్టులు , తెలంగాణలో 200 పోస్టులు ఉన్నాయి.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :  

ఈ నోటిఫికేషన్ ద్వారా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

🔥 విద్యార్హత

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగం లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వుండాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • GEN / EWS / OBC అభ్యర్థులకు ఫీజు 850/-
  • SC, ST, PwBD అభ్యర్థులకు ఫీజు 175/-

 🔥  వయస్సు : (01-10-2024 నాటికి)

  • 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 వయసులో సడలింపు వివరాలు : 

  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు వయో సడలింపు ఉంటుంది. 
  • OBC అభ్యర్థులకు వయసులో మూడేళ్లు వయో సడలింపు ఉంటుంది. 
  • PwBD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు వయో సడలింపు ఉంటుంది. 

🏹 NMDC లో ఉద్యోగాలు – Click here

🔥దరఖాస్తు విధానం :

  • పూర్తి అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

 🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులు కి ఆన్లైన్ లో పరీక్ష , గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, లాంగ్వేజ్ ప్రొఫెషియన్సీ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటివి చేసి ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష కేంద్రాలు :

  • మన రాష్ట్రంలోని వివిధ ప్రధాన పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. 
  • ఆంధ్రప్రదేశ్ లో అమరావతి, అనంతపురం, ఏలూరు, గుంటూరు / విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. 
  • తెలంగాణలో హైదరాబాద్ / సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

🔥 ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేది : 24/10/2024

🔥 ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 13/11/2/024

👉  Click here for notification  

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *