ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (APSWREIS) , తాడేపల్లి నుండి ఐఐటి / నీట్ కోచింగ్ సెంటర్స్ నందు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ,బోటనీ, జువాలజీ సబ్జెక్టులను బోధించేందుకుగాను స్పెషల్ మెంటార్ / ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ సంస్థ పరిధిలో గల కోచింగ్ సెంటర్స్ నందు పనిచేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
APSWREIS Faculty Recruitment 2025 :
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి గల విద్యార్హతలు? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? ఎంత వయసులోపు గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు? దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి ? వంటి అన్ని వివరాల కొరకు ఈ ఆర్టికలను చివరి వరకు చదవండి?
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ , తాడేపల్లి సంస్థ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥APSWREIS మొత్తం ఉద్యోగాల సంఖ్య :
అన్ని విభాగాలలో కలిపి మొత్తం 49 ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాదిపాదికన భర్తీ చేస్తున్నారు.
🔥 APSWREIS భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులను బోధించేందుకు గాను ఫ్యాకల్టీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
మ్యాథమెటిక్స్ – 08
ఫిజిక్స్ – 14
కెమిస్ట్రీ – 16
బోటనీ – 06
జువాలజీ – 05
🔥APSWREIS ఫాకల్టీ ఉద్యోగాలకు విద్యార్హతలు :
ఐఐటీలు, ఎన్ఐటీలు, బిట్స్, ఐఐఎస్ఇఆర్, సెంట్రల్ యూనివర్సిటీ నందు సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఐఐటి జేఈఈ / నీట్ కోచింగ్లలో మూడు సంవత్సరాలు టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో ఐదు సంవత్సరాలు కార్యాచరణ కలిగి ఉండాలి.
🔥APSWREIS ఫాకల్టీ ఉద్యోగాలకు ఉద్యోగాలకు వయస్సు :
01.05.2025 నాటికి 18 సంవత్సరాలు నిండియుండి 44 సంవత్సరాల లోపు వయస్సుగలవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులకు 10 సంవత్సరాలు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ ఉద్యోగులకు కనీసం మూడు సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥APSWREIS ఫాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్లో 26.05.2025 నుండి 11.06.2025 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
🔥APSWREIS ఫాకల్టీ ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు :
క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
ఓసి అభ్యర్థులు 500 రూపాయలు, బీసీ అభ్యర్థులు 300 రూపాయలు, ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
🔥APSWREIS ఫాకల్టీ ఉద్యోగాల పరీక్షా విధానం:
మొత్తం 100 మార్కులకు గాను పరీక్షను నిర్వహిస్తారు ఇందులో 80 మార్కులు ఓఎంఆర్ ఆధార్ తో రాత పరీక్షకు కేటాయించారు.
20 మార్కులను డెమో క్లాసులకు కేటాయించారు.
రాత పరీక్ష బహుళైచ్చిక ప్రశ్నలతో ఇంగ్లీష్ మాద్యమంలో ఉంటుంది మరియు నెగిటివ్ మార్కింగ్ విధానం కలదు.
రాత పరీక్ష నిర్వహణ కొరకు ఐఐటి నీట్ స్థాయి సిలబస్ను ప్రామాణికంగా తీసుకున్నారు.
రాత పరీక్ష 15.06.2025 నాడు నిర్వహిస్తారు.
🔥 APSWREIS ఫాకల్టీ ఉద్యోగాల ఎంపిక విధానం :
ఉద్యోగాలకు రాత పరీక్ష మరియు డెమో క్లాసు నందు వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
🔥APSWREIS ఫాకల్టీ ఉద్యోగాలకు జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన అభ్యర్థులకు గల పనితీరు మరియు పని అనుభవాన్ని ఆధారంగా చేసుకుని 50,000 రూపాయలు నుండి ఒక లక్ష రూపాయల వరకు ప్రతి నెల రెమ్యూనరేషన్ లభిస్తుంది.
🔥 హెల్ప్ డెస్క్ :
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ అయిన 26.05.2025 నుండి రిక్రూట్మెంట్ నిర్వహణ పూర్తయ్యేంతవరకు హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏనా సందేహాలు ఉంటే లేదా టెక్నికల్ సమస్యలు ఏర్పడినచో దరఖాస్తుదారులు 8978222529 నెంబర్ కు ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 గంటలలోపుగా సంప్రదించవచ్చు.
🔥 ముఖ్యమైన తేదిలు :
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 26.05.2025
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 11.06.2025
రాత పరీక్షా నిర్వహణ తేదీ: 15.06.2025
👉Click Here to download notification
👉Click here for official website