ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖలో భారీ స్థాయిలో ఖాళీ పోస్టులు ఉన్నాయి. దాదాపుగా 45% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని రకాల ఖాళీలు కలిపి దాదాపుగా 1310 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం ఉంది. ఈ ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
మండలాల్లో ఉండే తహసిల్దార్ కార్యాలయాల్లో మరియు డివిజన్లో ఉండే ఆర్డిఓ కార్యాలయాల్లో భారీగా ఖాళీలు ఉన్నట్టుగా సమాచారం.. పోస్టుల వారీగా ఖాళీలు వివరాలను చూస్తే 350 తహసిల్దార్ పోస్టులు, 150 డిప్యూటీ తహసిల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు 230 రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోస్టులు, 210 సీనియర్ అసిస్టెంట్లు పోస్టులు, 370 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీలే ఉన్నాయి.
🏹 ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు – Click here
ఇంత భారీ సంఖ్యలో రెవెన్యూ శాఖలో ఖాళీలు ఉండడం కారణంగా ప్రస్తుతం సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 679 మండలాలు ఉండగా వాటిల్లో 329 మంది తహసిల్దార్ లో ఉన్నారు. మిగతా మండలాలకు ప్రస్తుతం పనిచేస్తున్న తహసిల్దార్లే ఇన్చార్జిలుగా పని చేయాల్సి వస్తుంది.
ఇంత భారీ సంఖ్యలో ఖాళీలు ఉండడం కారణంగా రెవెన్యూ శాఖలో ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారం కాకపోవడం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖలో ఉద్యోగాల భర్తీ చేసే అవకాశం ఉంది. ఉన్న ఖాళీలను కొత్త నోటిఫికేషన్స్ ద్వారా కొన్ని పోస్టులు భర్తీ చేయడం, మరికొన్ని పోస్టులు అర్హులైన వారికి పదోన్నతులు ఇచ్చి భర్తీ చేసే అవకాశం ఉంది.
ప్రభుత్వం ఈ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ జారీచేసి అర్హత ఉన్న నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. 18 నుంచి 42 సంవత్సరాలు వయసు ఉన్న ఏదైనా డిగ్రీ పాసైన వారు ఇందులో ఉండే ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఇస్తారు. రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేస్తే మా వెబ్సైట్ ద్వారా మరియు మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా కూడా మీకు సమాచారం తెలియజేస్తాం.
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.