ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు | APDDCF Conract Basis Jobs Notification 2025 | AP Jobs

ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (APDDCF) ఉద్యోగాలు :

ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (APDDCF) నుండి కాంట్రాక్టు పద్ధతిలో మేనేజర్ (డైరీ) ఉద్యోగాలు భర్తీ కోసం అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉంది.

ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్నవారు అప్లై చేయండి.

🏹 AP లో వారికి భారీగా జీతాలు పెంపు – Click here

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹 Join Our What’s App Channel – Click here

Join Our Telegram Channel – Click here

🏹 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (APDDCF) నుండి విడుదల అయింది.

🏹 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

  • APDDCF నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్ (డైరీ) అనే ఉద్యోగాలు భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

🏹 APDDCF ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఉండవలసిన అర్హతలు :

  • APDDCF ద్వారా భర్తీ చేస్తున్న మేనేజర్ (డైరీ) ఉద్యోగాలకు డైరీ టెక్నాలజీలో బీటెక్ లేదా మార్కెటింగ్ లో ఎంబీఏ పూర్తి చేసిన వారు అర్హులు.
  • ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ లేదా ఒకటి నుంచి రెండు సంవత్సరాల వరకు అనుభవం ఉన్నవారు కూడా అప్లై చేయవచ్చు.

🏹 APDDCF మేనేజర్ (డైరీ) ఉద్యోగాలకు ఎంపికైన వారికి చెల్లించే జీతం వివరాలు :

  • APDDCF మేనేజర్ (డైరీ) ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 20 వేల రూపాయలు చొప్పున జీతం ఇస్తారు.

🏹 మొత్తం ఖాళీల సంఖ్య :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం తొమ్మిది పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🏹 పోస్టింగ్ ప్రదేశాలు :

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి మంగళగిరి, శ్రీకాకుళం, పార్వతీపురం, పాడేరు, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, కర్నూలు లలో పోస్టింగ్ ఇస్తారు.

🏹 అప్లికేషన్ విధానం :

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు APDDCF సంస్థ అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేయవచ్చు.

🏹 అప్లికేషన్ ఫీజు వివరాలు :

  • APDDCF ద్వారా భర్తీ చేయబడుతున్న మేనేజర్ (డైరీ) ఉద్యోగాలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.

🏹 ఉద్యోగాల కాలపరిమితి :

  • ప్రస్తుతం ఈ ఉద్యోగాలను ఒక సంవత్సరం కాలానికి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. సంస్థకు అవసరం మరియు అభ్యర్థి యొక్క పనితీరు ఆధారంగా కాంట్రాక్టు వ్యవధి పొడిగించవచ్చు.

గమనిక :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి నోటిఫికేషన్ పూర్తి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.

🏹 Notification & Apply Link – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!