ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP District Court Personal Assistant Jobs Recruitment

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు నుండి నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనో గ్రాఫర్ ( పర్సనల్ అసిస్టెంట్ ) అనే ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 20వ తేదీ లోపు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ నోటిఫికేషన్ ద్వారా కృష్ణా జిల్లాలో జిల్లా కోర్టులో  ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు.

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేయవచ్చు .

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 06

ఈ పోస్టులకు అప్లై చేయాలంటే నిరుద్యోగ అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి , దానితోపాటు ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఎగ్జామినేషన్స్ నుండి ఇంగ్లీషులో హయ్యర్ గ్రేడ్ నందు మరియు షార్ట్ హ్యాండ్ లో హయ్యర్ గ్రేడ్ నందు ఉత్తీర్ణత కలిగిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి.( హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు లేకపోతే లోవర్ గ్రేడ్ నందు ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటారు)  దీంతోపాటు కంప్యూటర్ ఆపరేషన్స్ కు సంబంధించిన నైపుణ్యం కలిగి ఉండాలి .

ఈ పోస్ట్ కు ఎంపికైన వారికి 18,500/- జీతం ఉంటుంది. 

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులకు 01-07-2023 నాటికి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి . అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ , ఎస్టీ , బిసి అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల సడలింపు కలదు .

ఈ పోస్టుకు అప్లై చేసే అభ్యర్థులు డిసెంబర్ 20వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు సంబంధిత కార్యాలయంలో అప్లికేషన్ అందజేయాలి .

ఈ పోస్టులకు స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ , కృష్ణ , మచిలీపట్నం

పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!