ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గృహహింస చట్ట విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను నవంబర్ 20వ తేదీ లోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.. ఈ పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడం జరుగుతుంది కాబట్టి ఉద్యోగాలు ఎంపికలో ఎలాంటి రాత పరీక్ష ఉండదు.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. ఆర్టికల్ చివరిలో ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్ చదివిన తర్వాత అర్హత ఉన్నవారు అప్లై చేయండి.. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకూడదు అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ చానల్స్ లో వెంటనే జాయిన్ అయిపోండి..
✅ జిల్లా కోర్టులో ఉద్యోగాలు – Click here
Table of Contents
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి విడుదల చేయడం జరిగింది.
భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా గృహహింస చట్ట విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు.
విద్యార్హతల వివరాలు :
- ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పాటు డిప్లమా ఇన్ కంప్యూటర్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అనే కోర్సు పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
జీతం వివరాలు :
- ఎంపికైన వారికి నెలకు 18,500/- జీతము ఇస్తారు.
ఎంపిక విధానం :
- అప్లై చేసిన అభ్యర్థులలో అర్హత ఉన్న వారికి ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ తేదీలు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 11-11-2025
- అ ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ : 20-11-2025
వయస్సు వివరాలు :
- 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అభ్యర్థులకు వయసులో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
- జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం, డి బ్లాక్, కొత్త కలెక్టరేట్, కడప, వైయస్సార్ కడప జిల్లా
గమనిక :
- అభ్యర్థుల అవగాహన కోసం ఈ ఆర్టికల్ ద్వారా మీకు నోటిఫికేషన్ లో ఉన్న ముఖ్యమైన వివరాలు తెలియజేశాము. పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అన్ని వివరాలు కూడా స్పష్టంగా చదివి తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లై చేయండి.
✅ Download Notification & Application – Click here
✅ Official Website – Click here
