ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపూర్ జిల్లాలో గల సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (Central University of Andhra Pradesh) నుండి వివిధ విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. టీచింగ్ విభాగంలో ఉద్యోగాన్ని చేయాలి అనుకుంటున్న వారికి ఇది చాలా మంచి అవకాశం.
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలు :
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు అనగా ఈ ఉద్యోగాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? అవసరమగు విద్యార్హతలు ఏమిటి? ఏ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి వంటి అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికలు చివరి వరకు చదవగలరు.
🔥సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లో అవుట్సోర్సింగ్ ప్రాధిపతికన పనిచేసేందుకు గాను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ భర్తీ చేసే ఉద్యోగాల సంఖ్య :
మొత్తం 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
క్రమ సంఖ్య | విభాగం | అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల సంఖ్య |
01 | పొలిటికల్ సైన్స్ | 04 |
02 | ఎకనామిక్స్ | 04 |
03 | మేనేజ్మెంట్ | 07 |
04 | కామర్స్ | 05 |
05 | ఇంగ్లీష్ | 04 |
06 | సైకాలజీ | 07 |
07 | కంప్యూటర్ సైన్స్ & AI | 09 |
08 | మాథెమాటిక్స్ & కంప్యూటింగ్ | 03 |
09 | మాలిక్యులర్ బయాలజీ | 02 |
10 | కంప్యూటషనల్ సోషల్ సైన్స్ | 01 |
11 | జాగ్రఫీ & జియో ఇన్ఫర్మాటిక్స్ | 02 |
12 | స్పేస్ సైన్స్ & టెక్నాలజీ | 02 |
మొత్తం | 50 |
- మొత్తం ఉద్యోగాలలో UR – 22 & OBC – 13 & SC – 07 & ST -03 & EWS – 05
🏹 టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు – Click here
🔥 సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు విద్యార్హతలు :
సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (PG) ఉత్తీర్ణత సాధించి , UGC NET లేదా SET/ SLET ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- నోటిఫికేషన్ లో Essential qualifications తో పాటుగా Desirable Qualifications విద్యార్హతలు ప్రస్తావించారు.అభ్యర్థులు essential qualifications ఉన్న సరే దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 Desirable qualifications :

🔥దరఖాస్తు విధానం :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో15/06/2025 వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి.
🔥 దరఖాస్తు ఫీజు :
- అభ్యర్థులు వెయ్యి రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- ఎస్సీ , ఎస్టీ , దివ్యాంగులు , మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది.
🔥ఎంపిక విధానం :
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
- ఇంటర్వ్యూను అనంతపురంలో గల సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ నందు నిర్వహిస్తారు.
- ఇంటర్వ్యూ తేదీ మరియు టైం ను దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ తెలియజేయడం జరుగుతుంది.
🔥జీతం :
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో కనీసం రెండు సంవత్సరాలు టీచింగ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నవారికి నెలకు 57,000/- జీతం లభిస్తుంది. టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేని అభ్యర్థులకు నెలకు 50 వల రూపాయలు జీతం లభిస్తుంది.
🔥ముఖ్యమైన తేదీలు :
- నోటిఫికేషన్ విడుదల తేదీ : 31/05/2025.
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 15/06/2025.