విద్యార్థులు, నిరుద్యోగులుకు శుభవార్త ! ఈ వేసవి కాలంలో కేంద్ర ప్రభుత్వమే తమ డిపార్ట్మెంట్ లో ఇంటర్న్షిప్ కల్పించి, స్టైఫండ్ ఇస్తుంది.
కేంద్ర ప్రభుత్వం యొక్క డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఏప్రిల్ 2025 నుండి సమ్మర్ ఇంటర్న్షిప్ దరఖాస్తు చేసుకొనేందుకు గాను అవకాశం కల్పించింది.
ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగ పరుచుకోండి.
ఈ ఇంటర్న్షిప్ కార్యక్రమం కి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.
ఈ ఇంటర్న్షిప్ ద్వారా భారతదేశం లోని ఔత్సాహిక యువతి యువకులకు ఉద్యోగ కల్పన కొరకు అవకాశం కల్పిస్తుంది.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ డిపార్ట్మెంట్ ఇంటర్న్షిప్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
🔥 విద్యార్హత :
భారతదేశానికి చెందియుండి డిగ్రీ ఉత్తీర్ణత సాధించినవారు మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో ఎన్రోల్ కాబడినవారు ఈ ఇంటర్షిప్ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 ఇంటర్న్షిప్ కాలపరిమితి :
జూన్ 01, 2025 నుండి జూలై 31 2025 వరకు అనగా రెండు నెలల కాలపరిమితి కొరకు ఈ ఇంటర్న్షిప్ నిర్వహిస్తారు.
🔥 స్టైఫండ్ :
ఇంటర్న్షిప్ కార్యక్రమానికి ఎంపిక కాబడిన వారికి పదివేల రూపాయల స్టైఫండ్ లభిస్తుంది.
🔥 దరఖాస్తు చేయు విధానం :
దరఖాస్తు చేసుకోవాలి అనుకొనే అభ్యర్థులు క్రింద ఇచ్చిన గూగుల్ ఫామ్ లింక్ ద్వారా రిజిస్టర్ అవ్వాలి.
🔥 ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 26/04/2025.
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు : మే 02 2025 నుంచి మే 13 2025 వరకు.
పైన సెలక్షన్ లిస్ట్ విడుదల తేదీ : 15 మే 2025.
సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు ,కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.
👉 Click here for official website