ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలియచేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2023 – 24 విద్యా సంవత్సరానికి గాను ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి గాను పెండింగ్ ఉన్న బకాయిలు విడుదల చేసేందుకు నిర్ణయించింది.
ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయంల ద్వారా పెండింగ్ బకాయిలు తేల్చేందుకు గాను సర్వే చేస్తుంది.
ఇందుకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచాలకుల వారి కార్యాలయం నుండి అధికారిక మార్గదర్శకాలు విడుదల చేయబడ్డాయి.
ఈ సర్వే కి సంబంధించి పూర్తి వివరాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ 2023-24 విద్యా సంవత్సరానికి గాను మొత్తం 4 విడతలలో ఒక విడత అమౌంట్ ను గతంలో విడుదల చేసింది.
- అయితే తర్వాత కాలంలో వివిధ కారణాల వలన మిగతా ఫీజును రీయింబర్స్ చేయలేక పోయింది.
- కాలేజ్ వారు మిగతా ఫీజు ను కొంత మంది విద్యార్థుల వద్ద వసూలు కూడా చేయడం జరిగింది. కొన్ని కళాశాలల వారు ఈ విషయంలో విద్యార్థులు నుండి ఫీజు వసూలు చేయలేదు.
- అయితే ఎవరైనా విద్యార్థులు కాలేజ్ ఫీజును తమ సొంత అమౌంట్ తో చెల్లించిన లేదా ప్రభుత్వం విడుదల చేసిన అమౌంట్ తప్ప మిగతా అమౌంట్ ను చెల్లించకపోయినా సంబంధిత సమాచారాన్ని సచివాలయంల ద్వారా సేకరిస్తున్నారు.
🔥 ఈ సర్వే ఎవరు చేస్తారు ? :
- గ్రామ, వార్డు సచివాలయం లో గల సచివాలయం సిబ్బంది ఈ సర్వే చేస్తారు.
- గ్రామ సచివాలయం లో అయితే సంక్షేమ విద్యా సహాయకులు (Welfare and Education Assistant) , వార్డు సచివాలయం లో వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ (WDPS) వారు ఈ సర్వే చేస్తారు.
🏹 AP Inter Supplementary Exams Results update – Click here
🔥 సర్వే విధానం – ముఖ్యాంశాలు:
- ఇప్పటికే సిబ్బంది ద్వారా సర్వే ప్రారంభమైనది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా డిజైన్ చేసిన జ్ఞానభూమి మొబైల్ అప్ లో సర్వే చేస్తున్నారు.
- ఇందులో భాగంగా 2023 – 24 విద్యా సంవత్సరంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి అర్హులు అయిన విద్యార్థులు వివరాలు పొందుపరచబడ్డాయి. ఇందులో విద్యార్థి మొత్తం ఫీజు ఎంత? ప్రభుత్వం మొదటి విడతలో ఎంత మొత్తం విడుదల చేసింది? ఇంకా ఎంత ఫీజు పెండింగ్ ఉంది ? అన్న అంశాలు ప్రీ పాపులేటేడ్ గా వస్తాయి.
- విద్యార్థి బ్యాలెన్స్ అమౌంట్ (ప్రభుత్వం విడుదల చేయని మొత్తం) ను తన సొంత అమౌంట్ తో ఏమైనా చెల్లించారా ? అనే ప్రశ్న వుంటుంది.
🔥 విద్యార్థి ఫీజు చెల్లిస్తే :
- విద్యార్థి ఫీజు చెల్లిస్తే, బ్యాలెన్స్ అమౌంట్ ను చెల్లించారా? అన్న ప్రశ్న వద్ద YES ఆప్షన్ సెలెక్ట్ చేసి, పాక్షికంగా చెల్లిస్తే Partially అని, మొత్తం చెల్లిస్తే Fully paid సెలెక్ట్ చేసుకోవాలి.
- ఆ తరవాత ఫీజు పే చేసిన రసీదులు యొక్క వివరాలు అనగా పే చేసిన ఫీజు మొత్తం, ఏ తేదీన పే చేశారు వంటివి సెలెక్ట్ చేసుకొని, ఫీ Receipt ను అప్లోడ్ చేయాలి.
- ఆ తర్వాత విద్యార్థి లేదా విద్యార్థి తల్లి యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ నమోదు చేసుకోవాలి.
🔥 విద్యార్థి ఫీజు చెల్లించకపోతే ?:
- విద్యార్థి ఫీజు చెల్లించకపోతే ఇందులో మూడు ఆప్షన్లు చూపిస్తాయి.
- విద్యార్థి చదువు కొనసాగించినట్లు అయితే Not paid fees ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
- విద్యార్థి చదువు నిలుపుదల చేసినట్లు అయితే , Student Discontinued ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
- విద్యార్థి మరణించినట్లు అయితే Student Deceased ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత విద్యార్థి / విద్యార్థి యొక్క తల్లి బయోమెట్రిక్ అథెంటికేషన్ నమోదు చేసుకోవాలి.
🔥 అవసరమగు ధ్రువపత్రాలు :
- 2023 – 24 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థి ఫీజు పేమెంట్ చేసిన రసీదులు అప్లోడ్ చేయవలసి వుంటుంది.
- ఫీజు రసీదులు అందుబాటులో లేనిచో NO due certificate అవసరమగును.
🔥 నోట్ :
- ఈ సర్వే లో నమోదు అయిన విద్యార్థులు కాలేజ్ కు ఫీజు బాకీ ఉన్నచో , విద్యార్థి తరుపున ప్రభుత్వం నేరుగా కాలేజీ ఖాతాకు ఫీజు విడుదల చేస్తుంది.
- కాలేజ్ ఫీజు మొత్తం పే చేసి, కాలేజ్ నకు బాకీ లేని విద్యార్థులకు ఈ పథకం ద్వారా విద్యార్థి మరియు తల్లి యొక్క జాయింట్ అకౌంట్ కి ఆ మొత్తాన్ని విడుదల చేస్తుంది.
- ఎటువంటి రసీదు లేకుండా ఫీజు పే చేసాము అన్న వాటికి , సచివాలయం లో అప్లోడ్ చేసేందుకు గాను అవకాశం ఉండదు.
🔥 సర్వే కొరకు చివరి తేదీ :
- ఈ సర్వే ను 30/05/2025 లోగా పూర్తి చేయవలసి వుంటుంది.
