ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డ్ సర్వీసులు కొనసాగుతున్నాయి. అయితే రేషన్ కార్డ్ సర్వీసులు చేసేటప్పుడు ఎదురవుతున్న కొన్ని అవాంతరాలను సరి చేసేందుకు గాను ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రజలకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలకు అనుగుణంగా దరఖాస్తు ఆన్లైన్ చేసే విధానంలో కూడా మార్పులు తీసుకొచ్చారు.
🏹 ఏపీలో ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య భీమా సౌకర్యం – Click here
🔥 కొత్త రేషన్ కార్డు కోసం మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదు :
రైస్ కార్డ్ లో వివాహం ద్వారా సభ్యుల్ని చేర్చేందుకుగాను గతంలో మ్యారేజ్ సర్టిఫికెట్ మరియు మ్యారేజ్ ఫోటోను తప్పనిసరి చేశారు.
అయితే చాలామంది ప్రజలకి మ్యారేజ్ సర్టిఫికెట్ లేనందువలన ప్రస్తుతం రైస్ కార్డులో వివాహం ద్వారా సభ్యులను ఆడ్ చేసినందుకుగాను ఇబ్బంది ఎదుర్కొన్నారు.
సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో మ్యారేజ్ సర్టిఫికెట్ చేసుకునేందుకు ఖర్చు అగుటచే చాలామంది మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేకుండా రైస్ కార్డ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని భావించారు.
ఇందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆన్లైన్ విధానంలో మ్యారేజ్ సర్టిఫికెట్ మరియు మ్యారేజ్ ఫోటో ఆప్షన్ను తొలగించి రైస్ కార్డ్ ఆడింగ్ ఆప్షన్ ను సులభతరం చేయడం జరిగింది.
ప్రస్తుతం రైస్ కార్డ్ లో వివాహం ద్వారా సభ్యులను చేర్చుట కొరకు మ్యారేజ్ సర్టిఫికేట్ మరియు మ్యారేజ్ ఫోటో అవసరం లేదు.
🔥 సక్రమంగా పనిచేస్తున్న EKYC లు:
రైస్ కార్డ్ దరఖాస్తు చేసుకున్న వారు తర్వాత గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల మొబైల్ యాప్ నందు EKYC నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
గత రెండు వారాలుగా EKYC నమోదు కొరకు APP సరిగా పనిచేయకపోవడం వలన ప్రజలు ఇబ్బంది పడ్డారు.
అయితే ప్రస్తుతం EKYC నమోదు కొరకు సర్వర్ సరిగా పనిచేస్తున్నందున రైస్ కార్డ్ దరఖాస్తుదారులు వీలైనంత త్వరగా మీ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించి రైస్ కార్డ్ ఈకేవైసీ నమోదు చేసుకోగలరు.
🏹 ప్రతీ రోజూ మీ మొబైల్ కు ఇలాంటి పథకాల సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింద ఇచ్చిన లింకు పైన క్లిక్ చేసి మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి..
✅ Join Our What’s App Group – Click here