భారతదేశంలోని ప్రముఖ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) సంస్థ నుండి ఆఫీస్ అసిస్టెంట్ (ప్యూన్) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
దేశవ్యాప్తంగా మొత్తం 500 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు విధానం , ఎంపికా విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం 500 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- ఆఫీస్ అసిస్టెంట్ (ప్యూన్) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22 ఉద్యోగాలను & తెలంగాణ రాష్ట్రంలో 13 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
- పదవ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
- అభ్యర్థి దరఖాస్తు చేసుకొనే రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతం యొక్క స్థానిక భాష పై ప్రావీణ్యం కలిగి వుండాలి.
🔥 వయస్సు :
- 18 సంవత్సరాలు నుండి 26 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ – సర్వీస్ మాన్ వారికి అభ్యర్థులకు 5 సంవత్సరాలు
- ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు
- దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
🔥 ఎంపిక విధానం :
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వ్రాత పరిక్ష, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫీసియన్సీ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం :
- 100 మార్కులకు గాను పరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలకు 80 నిముషాలు కేటాయించారు.
- ఇందులో ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, అర్ధమాటిక్ & రీజనింగ్ నుండి ఒక్కో విభాగం నుండి 25 ప్రశ్నలు వస్తాయి.ఒక్కో విభాగానికి 20 నిముషాల సమయం కేటాయించారు.
🔥 పరీక్షా కేంద్రాలు :
- దేశంలోని పలు ప్రముఖ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, కరీంనగర్, గుంటూరు / విజయవాడ, విశాఖపట్నం, కర్నూలులో పరీక్ష నిర్వహిస్తారు.
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 19,500/- రూపాయల ప్రారంభ బేసిక్ పే లభిస్తుంది.
- బేసిక్ పే తో పాటు వివిధ అలవెన్సులు వస్తాయి.
🔥 ప్రోబేషన్ పీరియడ్ :
- ఎంపిక కాబడిన అభ్యర్థులు ఆరు నెలల కాలం పాటు ప్రోబేషన్ లో వుంచబడతారు.
🔥 ముఖ్యమైన తేదిలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 03/05/2025
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 23/05/2025