బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా నుండి NMHS ఫండెడ్ ప్రాజెక్టులో భాగంగా తాత్కాలిక పద్ధతిన మూడు సంవత్సరాలు కాలానికి జూనియర్ రీసెర్చ్ ఫెలో, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను nmhsferns@gmail.com అనే మెయిల్ అడ్రస్ కు పంపించడం ద్వారా అప్లై చేయవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం తొమ్మిది పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో 3 జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు , 2 జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఉద్యోగాలు, 01 ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం, 3 ఆఫీసు అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి.
జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు జూనియర్ ప్రాజెక్టు ఫెలో ఉద్యోగాలకు బోటనీ లేదా లైఫ్ సైన్సెస్ లేదా ఎకాలజీ లేదా ప్లాంట్ సైన్సెస్ లో మొదటి తరగతిలో ఎంఎస్సీ పూర్తి చేసి ఉండాలి.
ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఆఫీసు అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
. . ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి వయస్సు 28 సంవత్సరాలు లోపు ఉండాలి.
జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు 37,000/- జీతంతో పాటు HRA ఇస్తారు.
. జూనియర్ ప్రాజెక్టు ఫెలో ఉద్యోగాలకు 24,000/- జీతంతో పాటు HRA ఇస్తారు.
. ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఆఫీసు అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు 20 వేల రూపాయలు జీతం ఇస్తారు.
. ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాల ఎంపికలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🏹 Download Notification – Click here
.