భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పరిధిలోని అటానమస్ సైంటిఫిక్ సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం (NCSM) నుండి వివిధ ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, ఆర్టిస్ట్, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు
పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం (NCSM) సంస్థ ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- టెక్నీషియన్ – ‘A’
- టెక్నికల్ అసిస్టెంట్ – ‘A’
- ఆర్టిస్ట్ – ‘A’
- ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ – III
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
- టెక్నీషియన్ – ‘A’ : (ఫిట్టర్ – 05 , కార్పెంటర్ – 06 , ఎలక్ట్రానిక్స్ – 01, ఎలక్ట్రికల్ – 01)
- టెక్నికల్ అసిస్టెంట్ – ‘A’ : (ఎలక్ట్రానిక్స్ – 01, కంప్యూటర్ – 02, ఎలక్ట్రికల్ – 02, మెకానికల్ – 02, సివిల్ – 02)
- ఆర్టిస్ట్ – ‘A’: 02
- ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ – III : 06
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 విద్యార్హత :
- టెక్నీషియన్ – ‘A’ :
- పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి, ఐటిఐ ఉత్తీర్ణత సాధించాలి.
- ఒక సంవత్సర కాలం ఐటిఐ చేసిన వారు సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.
- రెండు సంవత్సరాల ఐటిఐ పూర్తి చేసిన వారు సంబంధిత విభాగంలో ఒక సంవత్సర పని అనుభవం కలిగి వుండాలి.
- టెక్నికల్ అసిస్టెంట్ – ‘A’ :
- సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
- ఆర్టిస్ట్ – ‘A’ :
- కనీసం రెండు సంవత్సరాల ఫైన్ / కమర్షియల్ ఆర్ట్స్ విభాగంలో డిప్లమో లేదా సర్టిఫికెట్ పొంది ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి వుండాలి.
- ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ – III :
- హయ్యర్ సెకండరీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
- ఇంగ్లీషులో అయితే పది నిమిషాల్లో నిమిషానికి 35 పదాలు చొప్పున హిందీలో అయితే పది నిమిషాల్లో నిమిషానికి 30 పదాలు చొప్పున టైప్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి.
🔥 వయస్సు :
- టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ , ఆర్టిస్ట్ ఉద్యోగాలకు 35 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ – III ఉద్యోగాలకు 25 సంవత్సరాల లోపు వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
🔥 దరఖాస్తు ఫీజు :
- అభ్యర్థులు 885 /- రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, మహిళా, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
- దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 23/05/2025.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను ఆప్టిట్యూడ్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 జీతం :
- టెక్నీషియన్ – A, ఆర్టిస్ట్ , ఆఫీసు అసిస్టెంట్ గ్రేడ్ – III ఉద్యోగాలకు ఎంపిక అయి వారికి 19,900 – 63,200/- పే స్కేల్ వర్తిస్తుంది. వీరికి 33,000/- రూపాయలకు పైగా నెలవారి ప్రారంభ జీతం లభిస్తుంది.
- టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 29,200 – 92,300 /- పే స్కేల్ వర్తిస్తుంది. వీరికి నెలకి 53 వేలకు పైగా ప్రారంభ జీవితం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు :
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ : 23/05/2025
సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం , కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.