ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) నుండి ఫీల్డ్ సూపర్వైజర్ (సేఫ్టీ) ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో మార్చి 5వ తేదీ నుండి మార్చి 25వ తేదీలోపు సబ్మిట్ చేయాలి.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి.
✅ ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి అంటే మా Telegram / Whatsapp గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
PGCIL సంస్థ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ సూపర్వైజర్ (సేఫ్టీ) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం పోస్టులు సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 28 పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది.
🏹 AIIMS మంగళగిరిలో ఉద్యోగాలు – Click here
🔥 వయస్సు :
వయస్సు 29 సంవత్సరాల లోపు ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
PwBD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
✅ AP లో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ – Click here
🔥 విద్యార్హతలు :
ఎలక్ట్రికల్ / మెకానికల్ / సివిల్ / ఫైర్ టెక్నాలజీ మరియు సేఫ్టీ లలో కనీసం 55% మార్కులతో ఫుల్ టైం ఇంజనీరింగ్ డిప్లమో పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు.
🔥 అప్లికేషన్ ఫీజు :
GEN / OBC / EWS అభ్యర్థులకు నెలకు 300/- జీతము ఇస్తారు.
SC / ST / ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 జీతము వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు 23,000/- 1,05,000/- వరకు ఉండే పే స్కేల్ ప్రకారం జీతం ఇస్తారు. బేసిక్ పే తో పాటు ఇతర అలవెన్స్ కూడా ఇస్తారు.
🔥 అప్లికేషన్ విధానము :
అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.
🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ :
PGCIL ఫీల్డ్ సూపర్వైజర్ (సేఫ్టీ) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మార్చి 5వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది:
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో 05-03-2025 తేది నుండి సబ్మిట్ చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
25-03-2025 తేదిలోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి.
🔥 స్క్రీనింగ్ టెస్ట్ తేదీ :
ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ తేదీలను తర్వాత వెల్లడిస్తారు.
🔥 ఎంపిక విధానము :
అప్లై చేసిన అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ , డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ వంటి పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారా..
🏹 Download Notification – Click here
🏹 Apply Online- Click here