కేంద్ర ప్రభుత్వ సంస్థలో 10th, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు భర్తీ | BECIL Recruitment 2025 | Latest Jobs Notifications

బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి ఢిల్లీలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 12వ తేదీలోపు చేరవిధంగా పంపించాల్సి ఉంటుంది. 

ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదవడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకున్న తర్వాత ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఈ ఆర్టికల్ చివరిలో లింక్స్ కూడా ఇచ్చాము.

🏹 విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • BECIL జారీచేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా MRT, ఫుడ్ బేరర్, టెక్నాలజిస్ట్, MLT, అసిస్టెంట్ డైటీషియన్, PCC, PCM, ల్యాబ్ అటెండెంట్ మరియు డెంటల్ టెక్నీషియన్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 అప్లై చేయడానికి ఉండవలసిన అర్హతలు : 

  • పోస్టులను అనుసరించి 10th, 12th, డిగ్రీ వంటి విద్యార్హతలు ఉండాలి.

🔥 జీతము వివరాలు : 

  • MRT పోస్టులకు నెలకు జీతము – 20,903/-
  • ఫుడ్ బేరర్ పోస్టులకు నెలకు జీతము – 18,933/-
  • టెక్నాలజిస్ట్ పోస్టులకు నెలకు జీతము – 33580/-
  • MLT పోస్టులకు నెలకు జీతము – 40,710/-
  • అసిస్టెంట్ డైటీషియన్ పోస్టులకు నెలకు జీతము – 26,000/-
  • PCC పోస్టులకు నెలకు జీతము – 26,728/-
  • PCM పోస్టులకు నెలకు జీతము – 30,000/-
  • ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు నెలకు జీతము – 24,648/-
  • డెంటల్ టెక్నీషియన్ పోస్టులకు నెలకు జీతము – 21,970/-

🔥 వయస్సు వివరాలు : 

  • MRT ఉద్యోగాలకు 20 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
  • ఫుడ్ బేరర్ , టెక్నాలజిస్ట్, MLT, అసిస్టెంట్ డైటీషియన్ ఉద్యోగాలకు 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
  • PCC ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండాలి.
  • PCM ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాల లోపు ఉండాలి.
  • ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాల లోపు ఉండాలి.
  • డెంటల్ టెక్నీషియన్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాల లోపు ఉండాలి.

🔥 వయసులో సడలింపు వివరాలు : 

  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు వయసులో ఐదేళ్ల సడలింపు వర్తిస్తుంది. 
  • ఓబీసీ అభ్యర్థులకు వయసులో మూడేళ్ల సడలింపు వర్తిస్తుంది.
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • General / OBC / Ex-Serviceman / Women అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 590/-
  • SC / ST / EWS / PH అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 295/-

🔥 అప్లై విధానము : 

  • అర్హత ఉండే అభ్యర్థులు తమ అప్లికేషన్ పోస్టు ద్వారా పంపించాలి.

🏹 పదో తరగతి అర్హతతో 1124 ఉద్యోగాలు – Click here 

🔥 అప్లికేషన్ కు జతపరచాల్సిన సర్టిఫికెట్స్ : 

  • Self Attestation చేసిన డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలు అప్లికేషన్ కు జతపరచాలి.

1. విద్యా / వృత్తిపరమైన సర్టిఫికెట్లు.

2. 10వ తరగతి/జనన ధృవీకరణ పత్రం.

3. కుల ధృవీకరణ పత్రం 

4. పని అనుభవ ధృవీకరణ పత్రం 

5. పాన్ కార్డ్ కాపీ

6. ఆధార్ కార్డ్ కాపీ

7. EPF/ESIC కార్డ్ కాపీ

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు 12-02-2025 తేది నుండి అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : 

  • అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
  • ఇంటర్వ్యూ / అసెస్‌మెంట్ / నైపుణ్య పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : 

  • Broadcast Engineering Consultants India Limited (BECIL), BECIL BHAWAN, C-56/A-17, Sector-62, Noida-201307 (U.P)

🔥 ముఖ్యమైన గమనిక : 

  • ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. 

📌 Join Our Telegram Channel

🏹 Download Notification – Click here 

🏹 Download Application – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!