హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ , అమరావతి నుండి అన్ని జిల్లాలలో గల కోర్టులలో పనిచేసే విధంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
హైకోర్ట్ నుండి మొత్తం 1620 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్లు విడుదల కాగా ఇందులో 230 ఉద్యోగాలు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కావడం విశేషం.
డిగ్రీ అర్హత తో పొందే ఈ ఉద్యోగాలకు సంబంధించి అన్ని అంశాలు అనగా దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, అవసరమగు ధ్రువపత్రాలు, దరఖాస్తు ఫీజు ఎంత చెల్లించాలి. దరఖాస్తు చేయుటకు చివరి తేదీ ఏమిటి వంటి అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🏹 7వ తరగతి అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు – – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి నుండి అన్ని జిల్లాలో కోర్టులలో భర్తీ నిమిత్తం ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. (నోటిఫికేషన్ నెంబర్ : 02/2025 – RC dated:06/052025)
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి జిల్లాల ప్రాధిపతికన 13 జిల్లాలో కలిపి మొత్తం 230 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జిల్లా కోర్టులలో పనిచేసేందుకు గాను జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల రిక్రూట్ చేస్తున్నారు.
🔥 జిల్లాల వారీగా, సంఖ్యాపరంగా ఖాళీల వివరాలు:
13 జిల్లాల ప్రాధిపతికగా ఖాళీల వివరాలు కేటగిరి వారిగా నోటిఫికేషన్ లో ప్రస్తావించారు.
అనంతపురం – 11
చిత్తూరు – 25
తూర్పు గోదావరి – 28
గుంటూరు – 28
కృష్ణా – 25
కర్నూలు – 12
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు – 15
ప్రకాశం – 18
శ్రీకాకుళం – 14
విశాఖపట్నం – 15
విజయనగరం – 07
పశ్చిమ గోదావరి – 14
వైఎస్ఆర్ కడప – 18
కేటగిరీల వారిగా ఖాళీల వివరాల కొరకు క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక నోటిఫికేషన్ చెక్ చేయగలరు.
🔥అవసరమగు విద్యార్హత :
దరఖాస్తుదారులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. లేదా తత్సమాన విద్యార్హత కలిగి వుండాలి.
దరఖాస్తుదారులకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం లో పరిజ్ఞానం కలిగి వుండాలి. లేదా కంప్యూటర్ పై విద్యార్హత కలిగి వుండాలి.
🔥 భాషా అర్హత:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వారు దరఖాస్తు చేయు జిల్లాకు సంబంధించిన స్థానిక భాష/ స్థానిక భాషలపై ప్రావీణ్యం కలిగి ఉండాలి.
అనంతపురం జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి తెలుగు భాషతో పాటుగా కన్నడ భాష పై కూడా అవగాహన ఉండాలి.
చిత్తూరు జిల్లాలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న తెలుగు భాషతో పాటుగా తమిళం భాష పై అవగాహన ఉండాలి.
శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి తెలుగు భాషతో పాటుగా ఒరియా భాష పై అవగాహన కలిగి ఉండాలి.
మిగతా అన్ని జిల్లాల వారు కూడా కేవలం తెలుగు భాష పై అవగాహన ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥వయస్సు:
అర్హత కలిగిన అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు & దివ్యాంగులు కి 10 సంవత్సరాలు & ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ మరియు సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం వయో సడలింపు కలదు.
వయస్సు నిర్ధారణ కొరకు 01/07/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
🔥దరఖాస్తు విధానం :
అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 అవసరమగు ధ్రువపత్రాలు:
డేట్ ఆఫ్ బర్త్ కొరకు సంబంధిత ధ్రువపత్రం
కుల ధ్రువీకరణ పత్రం
ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ ( సంబంధిత వర్గాల వారు)
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ( సంబంధిత వర్గాల వారు)
సదరం సర్టిఫికెట్ ( దివ్యాంగులు)
ఎక్స్ సర్వీస్ మెన్ వారు డిశ్చార్జ్ సర్టిఫికెట్
స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలు కలిగి ఉండాలి.
స్థానికత నిర్ధారణ కొరకు 4వ తరగతి నుండి 7 తరగతి వరకు గల స్టడీ సర్టిఫికెట్లు కలిగి ఉండాలి.
🔥 అప్లికేషన్ ఫీజు:
అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు ను చెల్లించాలి.
ఓసి , బిసి, EWS, అభ్యర్థులు 800/- రూపాయలు & ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగులు 400/- రూపాయలు దరఖాస్తు ఫీజు ను చెల్లించాలి.
🔥 ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత వ్రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
ఈ వ్రాత పరీక్షలో వారి అభ్యర్థులకు గ్రాడ్యుయేషన్ స్థాయి ప్రశ్నలు అడుగుతారు.
వ్రాత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 పరీక్షా విధానం:
90 నిముషాల కాలపరిమితి తో 80 బహుళైచ్చిక ప్రశ్నలు కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ఇస్తారు.
ఇందులో జనరల్ నాలెడ్జ్ నుండి 40 ప్రశ్నలు & జనరల్ ఇంగ్లీష్ నుండి 40 ప్రశ్నలు వుంటాయి.
ప్రతీ ప్రశ్నకు ఒక్కో మార్కు కేటాయించారు.
జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఇంగ్లీష్ మరియు తెలుగు భాష లో ఉంటాయి.
🔥 జీతం:
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపిక అయిన వారి ప్రారంభం లోనే 30,000/- వేలకు పైగా జీతం లభిస్తుంది మరియు వివిధ అలవెన్సులు కూడా లభిస్తాయి.
🔥 ముఖ్యమైన తేదిలు :
నోటిఫికేషన్ విడుదల అయిన తేది: 06/05/2025
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 13/05/2025
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 02/06/2025
🔥 హెల్ప్ డెస్క్ వివరాలు:
ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సందేహాల నివృత్తి కొరకు హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుంది.
అభ్యర్థులు ఇమెయిల్ ఐడి: helpdesk-hc.ap@aij.gov.in & టెలిఫోన్ నెంబర్ : 0863 – 2372752 కు సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
ఉదయం 10:30 నిముషాల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుంది. (మధ్యాహ్నం 01:30 నుండి 02:15 వరకు లంచ్ బ్రేక్ )
👉 Click here for official website
సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు ,కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.