ఆంధ్రప్రదేశ్ గ్రూప్ -2 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది.
గ్రూప్ 2 నోటిఫికేషన్ లో ఉన్న రోస్టర్ తప్పులను సరిచేసి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు గత కొన్ని రోజులుగా ఏపీపీఎస్సీకి మరియు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని అభ్యర్థులు తమ నిరసన శాంతియుతంగా తెలిపారు. అయితే ఏపీపీఎస్సీ మొదటి నుంచి చెప్తున్నట్టుగానే షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించడానికి సిద్ధమైంది.
🏹 ప్రభుత్వ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు – Click here
✅ ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి అంటే మా Telegram / Whatsapp గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
మార్చి 11వ తేదీన హైకోర్టులో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు సంబంధించి మరోసారి విచారణ ఉందని మరియు రోస్టర్ తప్పులను సరి చేసిన తర్వాతే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏపీపీఎస్సీ సెక్రటరీకి లెటర్ పంపించినప్పటికీ మెయిన్స్ పరీక్ష వాయిదా వేయడానికి ఏపీపీఎస్సీ అంగీకరించలేదు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న MLC ఎలక్షన్ కోడ్ సందర్భంగా గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకోలేమని గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఏపీపీఎస్సీ తాజాగా ప్రకటన చేసింది.