ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ దారులకు శుభవార్త ! రాష్ట్రంలో ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.
అలానే కొత్తగా వితంతు పెన్షన్ మంజూరు చేసి, పంపిణీ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసింది.
ఈ అంశాలకు సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
ఇలాంటి పథకాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ లో వాట్సాప్ కి రావాలి అంటే క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥 ఆంధ్రప్రదేశ్ లో ఒక రోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా వృద్ధులకు, వికలాంగులకు వితంతువులకు, ఒంటరి మహిళలకు, మరియు వివిధ వృత్తికారులకు గ్రామ , వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ప్రతి నెలా 1వ తేదీన పెన్షన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.
- అయితే ఏదైనా నెల ఒకటవ తేదీ ఆదివారం గా ఉంటే ఒక రోజు ముందుగానే అనగా 31వ తేదీ / 30 వ తేదీ నాడే పెన్షన్ పంపిణీ చేసేందుకు గాను ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది.
- ఇందులో భాగంగా జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఆరోజు పంపిణీ చేయాల్సిన పెన్షన్ ను ఒకరోజు ముందుగా మే 31వ తేదీ (శనివారం) నాడు పంపిణీ చేయనున్నారు.
- ఇందుకు సంబంధించి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
- మే 31వ తేదీన ఉదయం ఏడు గంటల నుండి సచివాలయం సిబ్బంది పెన్షన్ దారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్నారు.
🏹 ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ (అకౌంట్ లోకి 5 లక్షలు) – Click here
🔥 స్పౌజ్ కేటగిరి క్రింద వితంతు పెన్షన్లు మంజూరు :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఒక్క సంవత్సరం అవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 89 వేలకు పైగా Spouse కేటగిరీ కింద వితంతు పెన్షన్లు మంజూరు చేయనుంది.
- ఇప్పటికే వీరికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం జూన్ 12వ తేదీ నాడు వీరందరికీ పెన్షన్ మంజూరు పత్రాలతో పాటుగా 4000 రూపాయలు పెన్షన్ మొత్తాన్ని కూడా అందించనుంది.
- కొత్తగా మంజూరైన ఈ మొత్తం పెన్షన్లు పంపిణీ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు 35.91 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.