భారత ప్రభుత్వం, డిపార్టుమెంటు అఫ్ స్పేస్ పరిధిలో గల ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) యొక్క అనుబంధ సంస్థ ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ICRB) సంస్థ నుండి సైంటిస్ట్ / ఇంజినీర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఎలక్ట్రానిక్స్, మెకానికల్ & కంప్యూటర్ సైన్స్ విభాగాలలో బి.ఈ / బి.టెక్ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన వారు ఈ రిక్రూట్మెంట్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన వివిధ అంశాల కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ICRB) సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
మొత్తం 63 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
సైంటిస్ట్ / ఇంజినీర్ ‘SC’ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 విద్యార్హత :
సంబంధిత విభాగంలో 65 శాతం మార్కులు లేదా 6.84 CGPA తో B.E/ B. టెక్ ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
సంబంధిత విభాగంలో వాలిడ్ గేట్ స్కోర్ కలిగి ఉండాలి.
🔥 వయోపరిమితి :
28 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
🔥 దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 దరఖాస్తు ఫీజు :
అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా 250/- రూపాయలు దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఫీజు మినహాయింపు కలదు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 ఎంపిక విధానం :
అభ్యర్థులను గేట్ స్కోర్ మరియు ఇంటర్వ్యూ నిర్వహణ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 ఇంటర్వ్యూ కి కేటాయించిన మార్కులు :
టెక్నికల్ నాలెడ్జ్ – 40 మార్కులు
సబ్జెక్ట్ ఆధారిత అవేర్నెస్ – 20 మార్కులు
కమ్యూనికేషన్ & ప్రెజెంటేషన్ స్కిల్స్ – 20 మార్కులు
కంప్రెహెన్షన్ – 10 మార్కులు
అకడమిక్ అచీవ్మెంట్స్ – 10 మార్కులు.
🔥 తుది సెలెక్షన్ వెయిటేజ్ :
గేట్ స్కోర్ కి 50 శాతం & ఇంటర్వ్యూ స్కోర్ కి 50 శాతం మార్కులు కేటాయిస్తారు.
జనరల్ అభ్యర్థులకు ఇంటర్వ్యూ లో కనీసం 60 మార్కులు రావాలి. & దివ్యాంగులు 50 మార్కులు సాధించాలి.
🔥 జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి లెవెల్ 10 పే స్కేల్ ప్రకారం 56,100/- రూపాయల బేసిక్ పే వర్తిస్తుంది. దీనితో పాటుగా వీరికి అన్ని అలవెన్సులు లభిస్తాయి.
🔥 ముఖ్యమైన తేదిలు :
ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 29/04/2025
ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 19/05/2025
ఫీజు పేమెంట్ చేయడానికి చివరి తేదీ : 21/05/2025
👉 Click here for official website