ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా వాట్సాప్ ద్వారా రేషన్ కార్డులు యొక్క సర్వీసులు ప్రారంభించింది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయంలలో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించగా, ప్రజల సౌకర్యార్థం ఇప్పుడు మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా సర్వీసులు ప్రారంభించింది.
వాట్సప్ ద్వారా రేషన్ కార్డ్ సర్వీసులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమగు ధృవపత్రాలు ఏమిటి వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
ప్రతీ రోజూ ఇలాంటి పథకాల సమాచారం మీ మొబైల్ కు రావాలి అంటే వెంటనే మా What’s App గ్రూప్ లో జాయిన్ అవ్వండి..
🔥 వాట్సప్ ద్వారా రేషన్ కార్డు సర్వీసులు ప్రారంభం అయ్యాయి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విధంగా వాట్సప్ ద్వారా రేషన్ కార్డ్ సర్వీస్ లు పొందేందుకు గాను ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
ఇందులో భాగంగా సివిల్ సప్లై సర్వీసెస్ విభాగంలో ఈ ఆప్షన్లు ఇవ్వడం జరిగింది.
సివిల్ సప్లై సర్వీసెస్ విభాగంలో గతంలో Deepam Status, Rice Drawn Status , Rice EKYC Status ఆప్షన్లు ఇవ్వగా ఇప్పుడు మరో 5 సర్వీసులు అదనంగా ప్రొవైడ్ చేశారు.
🔥 వాట్సప్ ద్వారా లభించే రైస్ కార్డ్ సర్వీసులు :
వాట్సాప్ మన మిత్ర చాట్ బాట్ ద్వారా ప్రస్తుతం 5 రైస్ కార్డ్ సర్వీసులను అదనంగా చేర్చారు. అవి
- Rice Card Surrender
- Member Addition in Rice Card
- Member Deletion in Rice Card
- Correction of Wrong Aadhar Seeding
- Splitting Rice Card Application
🔥 ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? :
- పౌరులు ముందుగా మన మిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ను సేవ్ చేసుకొని ఉంచుకోవాలి.
- తర్వాత వాట్సాప్ యాప్ లో ఆ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేయాలి.
- తర్వాత మన మిత్ర చాట్ బాట్ నుండి సర్వీస్ సెలెక్ట్ చేసుకొనేందుకు గాను “ సేవను ఎంచుకోండి” అనే లింక్ పై క్లిక్ చేయాలి.
- తర్వాత మీకు మెను లో మొత్తం అన్ని డిపార్ట్మెంట్ లు చూపిస్తాయి.
- “ సివిల్ సప్లై సేవలు” అనే విభాగంలో పై క్లిక్ చేస్తే…. అందులో లభించు అన్ని సేవలు కనిపిస్తాయి.
- రైస్ కార్డ్ కి సంబంధించి మీకు అవసరమగు సేవ ను ఎంపిక చేసుకోవాలి.
- ఆ తర్వాత దరఖాస్తు దారిని ఆధార్ కార్డు ఎంటర్ చేయవలసి వుంటుంది. ఆధార్ కి లింక్ కాబడిన ఫోన్ నెంబర్ OTP ద్వారా వెరిఫై చేసుకోవాలి.
- ముందుగా బేసిక్ డిటైల్స్ నింపాలి. అవి
- తండ్రి పేరు
- లింగం
- పుట్టిన తేదీ
- కులం
- మతం
- వైవాహిక స్థితి
- విద్యార్హత
- ఫోన్ నెంబర్
- మీ జిల్లా, మండలం , సచివాలయం ఎంపిక
- పిన్ కోడ్ లను పూరించాలి.
తర్వాత దరఖాస్తు ఫారం లో భాగంగా క్రింది వివరాలు నమోదు చేయాలి..
- కుటుంబ ఆదాయం
- వృత్తి
- నివాసం
- రైస్ కార్డ్ సర్వీస్ ఎంపిక చేసుకొని పేమెంట్ చేయాలి.
- ఆ తర్వాత సచివాలయం సిబ్బంది ద్వారా EKYC పూర్తి చేసుకోవాలి.