ఆచార్య NG రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు | ANGRAU Notification 2025 | AP Agriculture Department jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల లో గల ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో గల కాలేజీ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ , పులివెందుల నుండి టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలను కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ కొరకు సర్క్యులర్ మెమో విడుదల అయ్యింది.

కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు అయి ఈ ఉద్యోగాలను పొందవచ్చు 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

కాలేజీ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ , పులివెందుల నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ మరియు క్వాలిటీ అస్యూరెన్స్ విభాగంలో పనిచేసేందుకు గాను కాంట్రాక్ట్ ప్రాధిపతికన భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత : 

సంబంధిత విభాగంలో Ph.D ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

                 (లేదా)

ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ అస్యూరెన్స్ / ఫుడ్ సైన్స్ / ఫుడ్ టెక్నాలజీ / ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ / అగ్రికల్చరల్ బయోటెక్నాలజి / బయో కెమిస్ట్రీ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

బ్యాచిలర్ డిగ్రీ లో ఫస్ట్ డివిజన్ మార్కులు లేదా తత్సమాన మార్కులు సాధించి ఉండాలి.

3 సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.

సైన్స్ సిటేషన్ ఇండెక్స్ లో ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసి వుండాలి.

నెట్ క్వాలిఫికేషన్ కలిగి వుండాలి.

🔥 గరిష్ఠ వయస్సు :

పురుషులు కు గరిష్ట వయస్సు :- 40 సంవత్సరాలు 

మహిళలకు గరిష్ట వయస్సు :- 45 సంవత్సరాల

🔥 జీతం :

Ph.D అర్హత వున్న అభ్యర్థులకు 67,000/- రూపాయల తో పాటు HRA లభిస్తుంది.

మాస్టర్స్ డిగ్రీ అర్హత గల అభ్యర్థులకు 61,000/- రూపాయల జీతం తో పాటు HRA లభిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా  ఎంపిక చేస్తారు.

🔥 ఇంటర్వ్యూ నిర్వహణ తేది మరియు సమయం :

తేది : 24/04/2025 ఉదయం 11:00 గంటల నుండి నిర్వహించు వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు అయి అభ్యర్థులు ఎంపిక కావాల్సి ఉంటుంది.

🔥 ముఖ్యమైన అంశాలు :

ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపిక కాబడిన అభ్యర్థులు 11 నెలలకు గాను కాంట్రాక్టు ప్రాధిపతికన ఎంపిక కాబడతారు.

అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు బయో డేటా మరియు అన్ని సర్టిఫికెట్ ల జిరాక్స్ కాపీలు తీసుకొని వెళ్ళాలి.

అభ్యర్థులు క్రింద లింక్ లో ఇవ్వబడిన అధికారిక నోటిఫికేషన్ ను చదివి , అర్హతలను  సరి చూసుకుని ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు.

👉 Click here for notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!